Begin typing your search above and press return to search.

సక్సెస్‌ రాణీ 'స్లీప్‌ లెస్‌ నైట్స్‌'

By:  Tupaki Desk   |   9 Aug 2015 5:47 PM IST
సక్సెస్‌ రాణీ స్లీప్‌ లెస్‌ నైట్స్‌
X
సక్సెస్‌ తో వచ్చే కిక్కు వేరు. ఆ కిక్కుని అన్నిరకాలా ఆస్వాధిస్తోంది శ్రుతిహాసన్‌. ఈ భామ వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ ప్రత్యర్థులకు సవాల్‌ విసురుతోంది. లేటెస్టుగా శ్రీమంతుడు బ్లాక్‌ బస్టర్‌ హిట్‌. హిట్టు హిట్టుకి కాన్ఫిడెన్స్‌ లెవర్‌ పెరుగుతోంది కాబట్టి పబ్లిక్‌ అప్పియరెన్స్‌ లో చెలరేగిపోతోంది.

హాలీవుడ్‌, బాలీవుడ్‌ స్టార్లనే తలదన్నే మేకప్‌ తో దర్శనమిస్తోంది. ముఖ్యంగా డ్రెస్సింగ్‌ సెన్స్‌ లో జెన్నిఫర్‌ లోపెజ్‌, యాంజెలినా రేంజు లో రెచ్చిపోతోంది. స్లీవ్‌ లెస్‌ లు, టైట్‌ ఫిట్‌ లు, నెక్‌ లెస్‌ డ్రెస్సు లతో ఓపెన్‌ షోస్‌ కి అవకాశం ఉన్న ఏ డ్రెస్సుని వదిలిపెట్టడం లేదు. మునుపటి కంటే రెట్టింపు కాన్ఫిడెన్స్‌ తో ఓపెన్‌ చేసేస్తోంది. ఇలా విప్పి చూపించడంపై పబ్లిక్‌ లో విమర్శలొస్తున్నా.. ఎవరు ఏం అనుకుంటే నాకేంటి? అన్న చందంగా ఉంది వ్యవహారం.

ఇదంతా పరిశీలిస్తున్న విమర్శకులు మాత్రం ఓ మాట చెబుతున్నారు. ఇది ప్రత్యర్థులకు సవాల్‌ విసరడం లాంటిదే. సమంత, తమన్నా, రకూల్‌ ప్రీత్‌, రాశీ ఖన్నా వంటి నాయికలు రేసులో ఉన్నా తన రేంజుని టచ్‌ చేయడం అసాధ్యం అని చెప్పకనే చెప్పడమేనని అంటున్నారు. ఇప్పుడర్థమైందా అసలు సంగతి?