Begin typing your search above and press return to search.

యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానంటున్న స్టార్ హీరోయిన్!!

By:  Tupaki Desk   |   22 July 2020 4:30 PM GMT
యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానంటున్న స్టార్ హీరోయిన్!!
X
అందాల సినీతార శ్రుతి హాసన్.. గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శృతి నటిగా మాత్రమే కాదు.. ఓ గాయనిగా, మ్యూజిక్ కంపోజర్ గా కూడా సుపరిచితమే. అయితే ఈ టాలెంటెడ్ భామ.. త్వరలోనే ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభం చేయనుందట. ఇప్పటి వరకు శృతి యూకెలో అంతటా మ్యూజికల్ ప్రదర్శనలు ఇచ్చింది. అయితే తన మ్యూజిక్ టూర్లను ఇండియన్స్ మిస్ అయ్యారు. అందుకని ఈ బ్యూటీ.. తన మ్యూజిక్ టూర్లకు సంబంధించిన అన్నీ వీడియో ఫుటేజీలను ఆ యూట్యూబ్ ఛానల్లో అప్‌లోడ్ చేయనుంది.

ప్రస్తుతం శృతి తను సొంతంగా రూపొందించిన ఫస్ట్ ఆల్బమ్ కోసం వర్క్ చేస్తోంది. ఈ సందర్భంగా శృతి మాట్లాడుతూ.. "నేను సోషల్ మీడియాలో అభిమానులతో సరదాగా మాట్లాడాను. త్వరలోనే ఓ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి అభిమానులకు మరింత దగ్గర అవ్వాలని ఆలోచిస్తున్నా" అని తెలిపింది. ఇక యూట్యూబ్ ఛానల్ కంటెంట్ గురించి మాట్లాడుతూ.. "ఈ ఛానల్లో ఇకపై నా సొంత ట్రాక్స్ అప్లోడ్ చేస్తాను. బిటిఎస్ ఫుటేజ్ తో పాటు నా ప్రదర్శనలు.. మ్యూజికల్ టూర్ల అన్నీ వీడియోలు అందులోనే ఉంటాయి" అని చెప్పుకొచ్చింది.

సౌత్ ఇండియాలో ఐఏఎన్ఎస్ సంగీత ప్రదర్శనల మధ్య కూడా స్పందించి.. "సంగీతం ప్రపంచంలో ఎక్కడైనా ప్రేక్షకులపై ఆధారపడి ఉంటుంది. కళాకారుడు ప్రదర్శిస్తున్న సంగీతాన్ని వినడానికి అక్కడకు వచ్చారా లేదా అనేది పరిగణలోకి వస్తుంది. మా కోసం పాడాలని కోరుకునే వారు ఏదైనా ఇష్టంగా వినండి. మరో విషయం ఏమిటంటే.. నాకు తమిళ, తెలుగు, హిందీ పాటల పై మంచి అవగాహన ఉంది. విదేశాలలో ప్రేక్షకులు మోస్తరుగా ఉన్నారు. కానీ ఇంగ్లీష్ మ్యూజిక్ కోసం ప్రదర్శనలకు రావడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చింది అమ్మడు. ఇక శృతి యూకె టూర్స్ సంబంధించి నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. ఇదిలా ఉండగా శృతి ప్రస్తుతం రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటిస్తుంది.