Begin typing your search above and press return to search.

మెగాస్టార్ సినిమా కోసం శృతి హాసన్!

By:  Tupaki Desk   |   8 March 2019 5:49 AM GMT
మెగాస్టార్ సినిమా కోసం శృతి హాసన్!
X
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భారీ బడ్జెట్ పీరియడ్ ఫిలిం 'సైరా' లో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తి కాగానే చిరు - కొరటాల శివ కాంబినేషన్లో సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో ఒక కీలకమైన లేడీ క్యారెక్టర్ ఉందని ఆ క్యారెక్టర్ కోసం శృతి హాసన్ పేరును దర్శకుడు కొరటాల శివ పరిశీలిస్తున్నారని సమాచారం.

ఈ పాత్ర ఒక స్టార్ ఇమేజ్ ఉన్న నటి చేస్తేనే బాగుంటుందనే అలోచనలో కొరటాల శివ టీమ్ ఉందట. అందుకే శృతి హాసన్ పేరు తెరపైకి వచ్చిందట. ఇది కీలకమైన పాత్రే కానీ హీరోయిన్ పాత్ర కాదట. సో.. చిరంజీవి సమకాలికుడైన కమల్ హసన్ కూతురు శృతి తో జోడీ కట్టడం లాంటి విమర్శలకు తావు లేదు. కానీ ఈమధ్య సినిమాలకు దూరంగా ఉంటున్న శృతి ఈ పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

శృతి గతంలో పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్.. అల్లు అర్జున్ సినిమాలలో హీరోయిన్ గా నటించింది. మరో వైపు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన 'శ్రీమంతుడు' సినిమాలో శృతి హాసనే హీరోయిన్. సో.. అటు చరణ్ కు ఇటు కొరటాలకు మంచి పరిచయమే ఉంది కాబట్టి ఈ ఆఫర్ కు శృతి''యస్' చెప్పే అవకాశాలు ఉన్నాయని టాక్. శృతి ఒప్పుకుంటే మాత్రం ఈ సినిమా తనకు టాలీవుడ్ లో కమ్ బ్యాక్ ఫిలిం అవుతుంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.