Begin typing your search above and press return to search.

శ్రుతి అతడి పక్కన సెట్టవుతుందా?

By:  Tupaki Desk   |   21 Sep 2015 10:30 AM GMT
శ్రుతి అతడి పక్కన సెట్టవుతుందా?
X
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో స్టార్ లుగా ఎదిగే హీరోలు చాలా తక్కువమంది. తెలుగులో మనకిప్పుడు అలాంటి హీరో ఒక్క రవితేజ మాత్రమే మాత్రమే ఉన్నాడు. అతడి తర్వాత ఎవ్వరూ ఆ స్థాయిని అందుకోలేదు. ఐతే తమిళంలో ఈ టైపు హీరోలు చాలామందే ఉన్నారు. అజిత్ - విక్రమ్ - ధనుష్ లాంటి వాళ్లు సొంతంగా స్టార్ ఇమేజ్ సంపాదించారు. ఈ కోవలోనే శివకార్తికేయన్ అనే కుర్ర హీరో కూడా స్టార్ ఇమేజ్ సంపాదించాడు.

ఈ శివ కార్తికేయన్ ఒకప్పడు టీవీ యాంకర్. అనుకోకుండా ధనుష్ కళ్లల్లో పడి.. ‘3’ సినిమాలో అతడి ఫ్రెండు క్యారెక్టర్ చేశాడు. ఆ తర్వాత మరీనా - కేడి బిల్లా కిలాడి రంగా లాంటి చిన్న సినిమాల్లో నటించి ఓమాదిరిగా పేరు సంపాదించాడు. ఐతే శివను హీరోగా నిలబెట్టింది ధనుష్ నిర్మించిన ‘ఎదిర్ నీచిల్’ సినిమానే. ఆ తర్వాత అతను వెనుదిరిగి చూసుకోలేదు. వరుత్త పడాద వాలిబర్ సంఘం - మాన్ కరాటె - కాకి సట్టై లాంటి హిట్లతో స్టార్ హీరో అయిపోయాడు.

శివ కార్తికేయన్ కొత్త సినిమా ‘రజినీ మురుగన్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఇంతలోనే భాగ్యరాజ్ కన్నన్ అనే కొత్త దర్శకుడితో ఓ ప్రతిష్టాత్మక చిత్రం చేయబోతున్నాడు శివ కార్తికేయన్. పీసీ శ్రీరామ్ లాంటి సీనియర్ సినిమాటోగ్రాఫర్ - అనిరుధ్ లాంటి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ - సీన్ ఫ్రూట్ లాంటి హాలీవుడ్ మేకప్ మన్ ఈ సినిమాకు పని చేయబోతున్నారు. ఇందులో శ్రుతి హాసన్ ను హీరోయిన్ గా నటింపజేయాలని ప్రయత్నిస్తున్నారు. ఐతే ఆమె ప్రస్తుతం అరడజను సినిమాలతో బిజీగా ఉంది. ఇంతకుముందు ‘3’ సినిమాలో శ్రుతి హీరోయిన్ అయితే శివది చిన్న క్యారెక్టర్. కలర్ విషయంలోనూ ఇద్దరికీ మ్యాచ్ అవుతుందా అన్న డౌటు కూడా జనాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో శ్రుతి శివకు ఓకే చెబుతుందో లేదో చూడాలి మరి.