Begin typing your search above and press return to search.

గబ్బర్ పాప హ్యాట్రిక్ కొడుతుందా?

By:  Tupaki Desk   |   21 Aug 2015 11:10 PM GMT
గబ్బర్ పాప హ్యాట్రిక్ కొడుతుందా?
X
మన గబ్బర్ సింగ్ హీరోయిన్... అదేనండీ శృతి హాసన్ సుడి మామూలుగా లేదు. పవర్ స్టార్ పక్కన చేసినప్పటి నుంచీ హిట్లే హిట్లు. అమ్మడు కనిపిస్తే చాలు.. అన్ని మూవీలు ఆడేస్తున్నాయి. ఫ్లాప్ ల గురించి ఆలోచించాల్సిన అవసరమే రావడం లేదు కమల్ కూతురికి. ఒక తెలుగులోనే కాదు.. అన్ని భాషలనూ దున్నేస్తుంది శృతిహాసన్.

ఈ ఏడాది కూడా శృతి జోరు కొనసాగుతూనే ఉంది. హిందీలో గబ్బర్ ఈజ్ బ్యాక్ అంటూ.. అక్షయ్ తో ఆడిపాడింది. సమ్మర్ లో రిలీజైన ఈ మూవీ.. 135 కోట్లు కొల్లగొట్టుకుపోయింది. పెట్టుబడికి రెట్టింపు వచ్చింది ఈ సినిమాకి. ఇక టాలీవుడ్ అందగాడు మహేష్ బాబుకి జంటగా శృతి నటించిన శ్రీమంతుడు కూడా ఇరగదీసేసింది. ఇంకా ఈ మూవీ రికార్డులు రాస్తూనే ఉంది.

ఇప్పుడు తమిళంలో విజయ్ తో చేసిన మెగా బడ్జెట్ మూవీ పులి రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇందులో చిన్నదాని కేరక్టర్, గెటప్ చాలా వెరైటీగా ఉన్నాయి. కోలీవుడ్ లో హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీపై కూడా అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఇది కూడా హిట్టయితే... ఒక్కో భాషలో ఒక్కో సినిమా చొప్పున హ్యాట్రిక్ కొట్టిన రికార్డ్ శృతిహాసన్ సొంతమవుతుంది. ఇప్పుడున్న అంచనాలు చూస్తే... ఈ ఫీట్ అంత కష్టమేం కాదనిపిస్తోంది.