Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మత్స్య కన్యవా? సర్పకన్యవా?

By:  Tupaki Desk   |   21 Aug 2015 3:52 PM GMT
ఫోటో స్టోరి: మత్స్య కన్యవా? సర్పకన్యవా?
X
విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న 'పులి' చిత్రంలో శ్రుతిహాసన్‌ ఓ బ్రిలియంట్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. పాల బుగ్గల హన్సికతో పోటీపడుతూ నటించింది శ్రుతి. ఈ అమ్మడికి హీరోతో రోమాంచిత సన్నివేశాలు ఉన్నాయని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. శ్రుతి న్యూ స్టిల్స్‌ మీడియాకి రిలీజయ్యాయి. ఈ స్టిల్స్‌ లో అందాల శ్రుతి రూపం రకరకాల సందేహాలకు తావిచ్చింది.

మతిచెదిరే ఆ దివ్య రూపంలో రెండు రకాల షేడ్స్‌ కనిపించాయి. ఒక అందమైన సర్పకన్య వనంలో విహరిస్తే ఎలా ఉంటుందో అలాంటి దివ్యమైన రూపంతో ఆకట్టుకుంది. 'ది సార్సరర్స్‌ ఆఫ్‌ ది కింగ్‌' సినిమాలో సర్పరూపంలో విహరించే నాయికలా కనిపించింది. సేమ్‌ టైమ్‌ సాగరకన్య శిల్పాశెట్టిని తలపించేలా, మత్స్యకన్యలాగా కనిపిస్తోంది. ఒకవేళ విజయ్‌ ఓ వీరుడిగా అడవుల్లో తిరిగేప్పుడు అనూహ్యంగా తారసపడే సర్పకన్య ఈవిడే అయ్యి ఉంటుందా? లేదూ.. విజయ్‌ జలవిహారానికి వెళ్లినప్పుడు అక్కడ అందగత్తె రూపంలోకి మారే మత్సకన్య అవుతుందా? అన్న మిస్టరీ ఇప్పట్లో వీడేట్టు లేదు. వనకన్యవా? మత్స్యకన్యవా? సర్పకన్యవా? నువ్వే చెప్పమ్మా!