Begin typing your search above and press return to search.

రూ. 200 పే చేసి నాతో డ్యాన్స్ చేయండి

By:  Tupaki Desk   |   6 May 2020 7:00 AM IST
రూ. 200 పే చేసి నాతో డ్యాన్స్ చేయండి
X
ప్రపంచం మొత్తం కంటికి కనిపించని ఒక సూక్ష్మజీవి చేతిలో చిక్కుకుపోయింది. దీంతో అన్ని దేశాలు కరోనా మహమ్మారి నివారణకు లాక్ డౌన్ విధించారు. కరోనా లాక్‌ డౌన్ కార‌ణంగా ఇబ్బందులు ప‌డుతున్న నిరుపేద‌లు, కూలీలు, నిరాశ్ర‌య‌ల స‌హాయార్ధం సినీ రాజకీయ ప్రముఖులు తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ శ్రియా స‌ర‌న్‌ కూడా వారిని ఆదుకోడానికి న‌డుం బిగించారు. ఇందుకోసం ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌తో క‌లిసి ప‌నిచేస్తున్న ఆమె.. వినూత్నంగా విరాళాలు సేక‌రిస్తున్నారు. కోవిడ్ బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు ‘ది కైండ్‌ నెస్ ఫౌండేషన్ - చెన్నై టాస్క్‌ ఫోర్స్ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించింది. www.thekindnessproject.inలో కేవ‌లం 200 రూపాయలు చెల్లించి రిసిప్ట్‌ ను మెయిల్ చేసి వివ‌రాలు న‌మోదు చేసుకోవాల్సిందిగా కోరారు. శ‌నివారం సాయంత్రం 8 గంట‌ల‌వ‌ర‌కు ఈ అవ‌కాశం ఉంద‌ని, ఆదివారం విజేత‌ల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని పేర్కొంది. లక్కీడ్రాలో విజేత‌లుగా నిలిచిన వారు వీడియో కాల్ లో త‌న‌తో క‌లిసి డ్యాన్స్ యోగా చేసే అవ‌కాశం సొంతం చేసుకోవ‌చ్చ‌ని తెల‌పింది.

అంతేకాకుండా మీరిచ్చే విరాళాలు అన్ని నిరుపేద‌ల‌కు చేరుతాయ‌ని.. ఈ మంచి ప‌నిలో అంద‌రం భాగ‌స్వాములం అవుదాం అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా పిలుపునిచ్చారు. ఇంకా కొన్ని రోజుల వ‌ర‌కు మ‌నం ఈ వైర‌స్‌ తో పోరాడాల్సి ఉంద‌ని.. ఇంట్లో పెద్ద‌వాళ్లు ఉంటే మ‌రింత జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని సూచించింది. అంద‌రూ సుర‌క్షితంగా ఉండాల‌ని.. కరోనా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంట‌నే స్వీయ నిర్భంధంలోకి వెళ్లాల్సిందిగా కోరింది. ఇదిలా ఉండగా శ్రియా స‌ర‌న్‌ న‌టించిన 'న‌ర‌గ‌సూర‌న్' అనే త‌మిళ చిత్రం త్వ‌రలోనే విడుద‌ల కానుంది. కార్తీక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అర‌వింద్ స్వామి, సందీప్ కిషన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా తెలుగులో 'నరకాసురుడు' పేరుతో విడుదల కానుంది. రష్యాకు చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కొశ్చివ్‌ను రెండేళ్ల క్రితం శ్రియ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ దంపతులు స్పెయిన్‌ లోని బార్సిలోనాలో ఉంటున్నారు. లాక్ డౌన్ లో ఇంటికే పరిమితమైన వీరిద్దరూ డైలీ ఏదొక పోస్ట్ సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులకు టచ్ లో ఉంటున్నారు.