Begin typing your search above and press return to search.

బేబీ బంప్ తో శ్రియ స్టెప్పులు..ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

By:  Tupaki Desk   |   21 April 2022 4:24 AM GMT
బేబీ బంప్ తో శ్రియ స్టెప్పులు..ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!
X
శ్రియ శరణ్.. ఈ బ్యూటీ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 'ఇష్టం'తో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ‌.. మొద‌టి చిత్రంలోనే త‌న‌దైన అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత త‌న టాలెంట్ తో అన‌తి కాలంలోనే స్టార్ హోదాను ద‌క్కించుకున్న శ్రియ‌.. టాలీవుడ్ లో దాదాపు స్టార్ హీరోలంద‌రితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే తమిళ, మలయాళం, హిందీ, కన్నడలోనూ న‌టించి.. ఆయా భాష‌ల్లో త‌న‌కంటూ మంచి గుర్తింపు ద‌క్కించుకుంది.

సినిమాల్లో నటిస్తూ ఉండగానే శ్రియ రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను గ‌ప్ చుప్ గా వివాహం చేసుకుంది. 2018 మార్చిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల న‌డుమ వైభ‌వంగా వీరి వివాహం జ‌రిగింది. పెళ్లి త‌ర్వాత భ‌ర్త‌తో ఓవైపు ఫ్యామిలీ లైఫ్ ను, మ‌రోవైపు కెరీర్ ను బాగానే కొన‌సాగించిన శ్రియ‌..2020 లాక్‌డౌన్ స‌మ‌యంలో పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.

కానీ, త‌న ప్రెగ్నెన్సీ విష‌యాన్ని మ‌రియు పాప పుట్టిన విష‌యాన్ని చాలా కాలం ర‌హ‌స్యంగానే ఉంచి శ్రియ.. చివ‌రాఖ‌రకు 2021లో త‌న‌ ఏంజ‌ల్‌ను అంద‌రికీ ప‌రిచ‌యం చేసింది. మాతృత్వంలో ఉండే ఆనందాన్ని కూడా ఆమె వివరించింది.

అలాగే త‌న‌ పాప‌కు 'రాధ‌' అనే పేరును పెట్టుకున్న శ్రియ‌.. త‌ర‌చూ ముద్దుల కుమార్తెతో గ‌డిపిన క్ష‌ణాల‌ను ఫొటోలు, వీడియోల రూపంలో సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటుంది.

అయితే తాజాగా మాత్రం త్రోబ్యాక్ అంటూ ప్రెగ్నెంట్ గా ఉన్న స‌మ‌యంలో బేబీ బంప్ తో డ్యాన్స్ చేసిన వీడియోని శ్రియ అంద‌రితోనూ షేర్ చేసుకుంది. '2020 లుక్ బ్యాక్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది. మ‌రోవైపు అభిమానులు శ్రియ వీడియోను చూసి ఫిదా అయిపోతున్నారు.

కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఇటీవ‌ల‌ ఈ బ్యూటీ 'ఆర్ఆర్ఆర్‌' సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఇందులో ఈమెది చిన్న పాత్రే అయినా.. ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. ఇక ప్ర‌స్తుతం శ్రియ‌ క‌న్న‌డ‌లో 'క‌బ్జా' అనే మూవీ చేస్తోంది. ఇందులో మ‌ధుమ‌తిగా మ‌హారాణిగా ఆమె క‌నిపించ‌బోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన శ్రియ ఫ‌స్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.