Begin typing your search above and press return to search.

డైరెక్టర్లు ఫస్ట్ చెప్పేదొకటి తీసేదొకటి.. స్టార్ హీరోయిన్

By:  Tupaki Desk   |   25 April 2020 4:40 PM IST
డైరెక్టర్లు ఫస్ట్ చెప్పేదొకటి తీసేదొకటి.. స్టార్ హీరోయిన్
X
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌లలో ఒకరు శ్రియా శరణ్. ప్రస్తుతం తన భర్తతో వైవాహిక జీవిత మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. అందమైన హీరోయిన్ గానే కాదు పెళ్లయ్యాక ఓ మంచి భార్యగా కూడా నడుచుకుంటుందట. పెళ్ళైనా కానీ సినిమాలకు గుడ్ బై చెప్పకుండా.. అడపాదడపా వెండితెర పై మెరుస్తూనే ఉంది. మంచి స్క్రిప్ట్ ఉంటే.. సినిమాకు ఓకే చెప్తా అంటుందట. ఈ మధ్య తెరపై శ్రీయ కనిపించడం తగ్గింది. ఈ సందర్భంగా శ్రియను అవకాశాలు రావడం లేదా.. లేక మీరే సినిమాలను వదిలేశారా? ప్రత్యేక గీతాలకు అయితే ఓకే చేస్తున్నారు? అని అడిగిన ప్రశ్నలకు శ్రియ ఇలా సమాధానం ఇచ్చింది.. "మనకు వచ్చే పాత్రలన్నీ ఆలోచించకుండా ఓకే చేయకూడదు.

అదీగాక కొంతమంది దర్శకనిర్మాతలు ఫస్ట్ లో చెప్పే కథ ఒకటి.. తర్వాత తీసే విధానం మరోలా ఉంటుంది. అలాంటి అనుభవాలను నేను కూడా ఎదుర్కొన్నాను. అందుకే పూర్తి స్క్రిప్ట్ తో వస్తేనే ఓకే చేస్తున్నా. పూర్తి స్క్రిప్ట్ లేకుండా వస్తే నో చెప్పేస్తున్నాను. స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారని కొందరు అడిగారు. అవును నేను స్పెషల్‌ సాంగ్స్‌ చేసే టైంలో హీరోయిన్లు ఎవరూ స్పెషల్ సాంగ్స్ చేయట్లేదు. స్పెషల్ సాంగ్స్ చేస్తే హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోతాయని భయపడతారు. కానీ నిజం ఏంటంటే.. స్పెషల్‌ సాంగ్స్‌ చేసి హీరోయిన్‌గా మన సత్తా చాటవచ్చు. ఈ విషయాన్ని నేను నిరూపించి చూపించాను. సినిమాలో ప్రత్యేక పాటలకు ప్రాధాన్యం ఉండి.. అది సినిమాకి ప్లస్‌ అవుతుంది అన్నప్పుడే నేను ఓకే చేస్తాను..." అంటూ శ్రియ వివరణ ఇచ్చింది.