Begin typing your search above and press return to search.

రెచ్చిపోడానికి మెగాస్టార్ మేనకోడలు రెడీ

By:  Tupaki Desk   |   28 Jun 2017 11:09 AM GMT
రెచ్చిపోడానికి మెగాస్టార్ మేనకోడలు రెడీ
X
ఉత్తరాది పిల్ల శ్రియా శర్మ దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు బాగానే తెలుసు. మూడో ఏటనే సినీ అరంగేట్రం చేసిన ఈ చిన్నదాని వయసు ఇప్పుడు 20 సంవత్సరాలు. ఇప్పటికే 17 ఏళ్ల నటనా జీవితాన్ని పూర్తి చేసేసుకుందంటే.. యాక్టింగ్ లో ఈమె ట్యాలెంట్ అర్ధమవుతుంది. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా శ్రియా శర్మ బాగానే తెలుసు.

జై చిరంజీవ చిత్రంలో మెగాస్టార్ కి మేనకోడలిగా నటించి మెప్పించింది. దూకుడు చిత్రంలో మహేష్ బాబుతో కూడా కలిసి నటించింది. ఆ తర్వాత హీరోయిన్ గా అవతారం ఎత్తిన శ్రియా శర్మ.. గాయకుడు మూవీతో లీడ్ రోల్స్ లోకి మారింది. 2014లో హీరోయిన్ గా మారిన శ్రియా శర్మ.. రీసెంట్ గా నిర్మలా కాన్వెంట్ మూవీలోనూ కనిపించింది. అయితే.. చైల్డ్ యాక్ట్రెస్ గా విపరీతమైన పాపులరాటీ సంపాదించుకున్నా.. హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న వారి కౌంట్ తక్కువగానే ఉంటుంది. ఆ విషయాన్ని గమనించిన శ్రియా శర్మ.. ఇప్పుడు తనలోని మరో యాంగిల్ ని చూపించడానికి రెడీ అయిపోయింది.

ఇప్పటికే ఓ హాట్ ఫోటో షూట్ ను చేసిన శ్రియా శర్మ.. తను గ్లామర్ రోల్స్ కి రెడీ అంటూ చెప్పకనే చెప్పింది. యాక్టింగ్ లో బోలెడంత ట్యాలెంట్ ఉన్న శ్రియా శర్మ.. అవకాశం వస్తే రెచ్చిపోవడానికి రెడీ అన్నట్లు సిగ్నల్స్ ఇస్తోంది. మరి ఇప్పుడైనా అవకాశాలు దరికి చేరతాయో లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/