Begin typing your search above and press return to search.

శ్రేయ 'నో' కు కారణం ఏంటో?

By:  Tupaki Desk   |   2 Sept 2020 6:00 AM IST
శ్రేయ నో కు కారణం ఏంటో?
X
పుష్కర కాలం పాటు తెలుగు.. తమిళం.. హిందీ భాషల్లో నటించి సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా కొనసాగిన శ్రేయ కెరీర్‌ మెల్ల మెల్లగా డౌన్‌ ఫాల్‌ అవుతూ వస్తోంది. యంగ్‌ స్టార్స్‌ సినిమాలో ఈమెకు ఛాన్స్‌ లేకున్నా చిరంజీవి బాలకృష్ణ వంటి సీనియర్‌ హీరోలకు వాంటెడ్‌ హీరోయిన్‌ గా ఉంది. పెళ్లి తర్వాత కూడా వచ్చిన ప్రతి అవకాశంను సద్వినియోగం చేసుకుంటున్న శ్రియ ఈసారి వచ్చిన ఒక మంచి ఆఫర్‌ ను మాత్రం కాదనుకుంది. భారీ పారితోషికంతో పాటు సినిమాలో హీరోయిన్‌ కాకున్నా నటనకు ఆస్కారం ఉన్న పాత్ర కథలో చాలా కీలకమైన పాత్ర. అదే అంధాదున్‌ లో టబు పోషించిన పాత్ర.

నితిన్‌ రీమేక్‌ చేస్తున్న అంధాధున్‌ లోని టబు పాత్ర కోసం మొదట నయన్‌ ను సంప్రదించగా ఆమె భారీ పారితోషికం డిమాండ్‌ చేయడంతో శ్రియ వద్దకు వెళ్లిందా పాత్ర. ఏం జరిగిందో ఏమో కాని ఇప్పుడు మళ్లీ టబు వద్దకే దర్శకుడు వెళ్లాడట. ఆమె అడిగిన పారితోషికంను ముట్టజెప్పి కన్ఫర్మ్‌ చేసుకున్నారట. మరి రీమేక్‌ లో టబు పాత్రను శ్రియ ఎందుకు వద్దన్నది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి సమయంలో వచ్చే ప్రతి ఆఫర్‌ ను అంది పుచ్చకుంటేనే ఇండస్ట్రీలో మరికొంత కాలం కొనసాగుతుంది.

ఆ విషయాన్ని ఆమె పట్టించుకోవడం లేదా లేదంటే మరేదైనా కారణం వల్ల అంధాదున్‌ కు నో చెప్పిందా అనేది తెలియాల్సి ఉంది. ఆమద్య శ్రియ ప్రెగ్నెంట్‌ అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ కారణంగా ఏమైనా ఈ సినిమాకు శ్రియ నో చెప్పిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రియ నో చెప్పడంతో ఇంకా అన్వేషణ చేయడం ఇష్టం లేని మేకర్స్‌ హిందీలో నటించిన టబునే ఫైనల్‌ చేశారు.