Begin typing your search above and press return to search.

వీడియో: వామ్మోవ్ శ్రీయ‌! పెద్ద ప్ర‌మాదమే త‌ప్పింది!

By:  Tupaki Desk   |   2 March 2021 4:41 AM GMT
వీడియో: వామ్మోవ్ శ్రీయ‌! పెద్ద ప్ర‌మాదమే త‌ప్పింది!
X
ప్ర‌పంచంలో ఏడు వింత‌లు నిరంత‌రం యాత్రికుల‌ చ‌ర్చ‌ల్లోనే ఉంటాయి. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ త‌న అన్ని సినిమాల్లో ఈ వింత‌ల్ని చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఇక ఈ ఏడు వింత‌ల్లోనూ `మచు పిచు` అనే వింత చాలా ప్ర‌త్యేక‌మైన‌ది పురాత‌న‌మైన‌ది. పెరూ దేశంలోని ప్రపంచ వారసత్వ కట్టడం మచు పిచు.. ప‌ర్యాట‌కంగా బాగా ఫేమస్‌. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది చెందిన ఈ పర్యాటక ప్రాంతానికి నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తూ ఉంటారు.

ఇంత‌కుముందు శంక‌ర్ ఇక్క‌డ భారీత‌నం నిండిన పాట‌ల్ని చిత్రీక‌రించారు. యాధృచ్ఛిక‌మో ఏమో కానీ శ్రీయ ప్ర‌స్తుతం మ‌చు పిచు ప‌ర్య‌ట‌న‌లో ఉంది. హ‌బ్బీ ఆండ్రూ కోశ్చీవ్ తో క‌లిసి ఈ విహార యాత్ర‌ను న‌చ్చిన‌ట్టు ఎంజాయ్ చేస్తోంది. ఆండ్రూని పెళ్లాడింది మొద‌లు శ్రీయ నిరంత‌రం టూరిస్టుగా మారి ప్ర‌పంచంలోని అన్ని వింత‌లు విశేషాల్ని ఆస్వాధించేస్తోంది. ఇప్పుడు మ‌చు పిచు త‌న డెస్టినీగా మారింది.

ఇదిగో ఈ వీడియోలో ఫ‌న్ కం డేంజ‌ర్ ఎలిమెంట్ చూస్తున్నారు క‌దా! మ‌చు పిచు ప‌రిస‌రాల్లోని ప‌చ్చిక బ‌యళ్లలో ఉన్న ఈ ప్ర‌త్యేక‌మైన మూగ జీవిని తెరిపారా ప‌రిశీల‌న‌గా చూస్తున్న శ్రీయ మీదికే ఉరికింది. హ‌బ్బీ కోశ్చీవ్ ఆ జంతువు మీదుగా శ్రీయ‌ను క‌వ‌ర్ చేస్తూ ఈ వీడియోను షూట్ చేస్తుంటే అది బెదిరిపోయి మీదినుంచి ఉర‌క‌బోతే ఒడుపుగా త‌ప్పుకుంది శ్రీయ‌.

వామ్మోవ్ పెద్ద ప్ర‌మాద‌మే త‌ప్పింది! అయితే ఆ క్ష‌ణం ఈ అమ్మ‌డికి చెమ‌ట‌లు ప‌ట్టేశాయ‌ని ఆ అరుపులే చెబుతున్నాయి. పెద్ద ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకుంది! అన్న‌ట్టు శ్రీ‌య శ‌ర‌ణ్ కు ఇటీవ‌ల స‌రైన ఆఫ‌ర్లు లేవు. 2018లో `గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి` త‌ర్వాత ఛాన్సులే లేవ్. ఆర్.ఆర్‌.ఆర్ లో అతిథి పాత్రలో చేస్తోంది. అలాగే `గ‌మ‌నం` అనే చిత్రం చేస్తోంది. కొన్ని మిడిల్ డ్రాప్ అయిన చిత్రాల వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. అందుకే త‌న భ‌ర్త‌తో క‌లిసి విదేశీ విహార‌యాత్ర‌ల్లో టైమ్ స్పెండ్ చేస్తోంది. తెలుగు త‌మిళంలో ద‌ర్శ‌క హీరోలు పిలిచి అవ‌కాశాలిచ్చేవ‌ర‌కూ ఇలా యాత్ర‌ల‌కు ప‌రిమితం కావాల్సి ఉంటుందేమో!