Begin typing your search above and press return to search.

బాలయ్యతోనే కాదు.. చిరు సినిమాలోనూ

By:  Tupaki Desk   |   23 Sept 2016 11:15 AM IST
బాలయ్యతోనే కాదు.. చిరు సినిమాలోనూ
X
లేటు వయసు అయినా.. ఆ ఏజ్ ని అస్సలు కనపడనివ్వని అందం శ్రియా శరణ్ సొంతం. 16 ఏళ్లుగా ఓ హీరోయిన్ తన కెరీర్ ని హీరోయిన్ గానే కంటిన్యూ చేయగలగడం మామూలు విషయం కాదు. ఆ అరుదైన రికార్డును.. రీసెంట్ టైమ్ లో సాధించగలగిలిన శ్రియ.. ప్రస్తుం నందమూరి బాలకష్ణ వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణిలో నటిస్తోంది.

బాలయ్య మూవీలో మహారాణి వశిష్టీ దేవిగా శ్రియ నటిస్తుండగా.. ఈ సినిమా 2017 సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇదే పొంగల్ పండక్కి రానున్న మరో మూవీ ఖైదీ నెంబర్ 150. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో కూడా శ్రియకు ఓ రోల్ చేయాలనే ఆఫర్ వచ్చిందట. ఖైదీ నెంబర్ 150లో రోల్ చేయాల్సిందిగా.. దర్శకుడు వివి వినాయక్ నుంచి ఆఫర్ రావడంతో.. వెంటనే యాక్సెప్ట్ చేసిందట శ్రియ.

గతంలో చిరంజీవితో కలిసి.. టాగూర్ చిత్రంలో శ్రియ నటించిన సంగతి తెలిసిందే. అప్పటికి ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ మూవీ కూడా వివి వినాయక్ దర్శకత్వంలోనే రూపొందింది. ఇప్పుడు మరోసారి చిరంజీవితో కలిసి నటించే అవకాశం రావడంతో.. వెంటనే ఆఫర్ ని శ్రియ ఒప్పేసుందని తెలుస్తోంది.