Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: 37 ఏజ్ సీనియ‌ర్ బ్యూటీ విర‌హాగ్ని

By:  Tupaki Desk   |   29 April 2020 4:15 AM GMT
ఫోటో స్టోరి: 37 ఏజ్ సీనియ‌ర్ బ్యూటీ విర‌హాగ్ని
X
న‌ల‌భైలో అడుగు పెట్టేందుకు ఇంకెంతో దూరంలో లేదు. ఇప్ప‌టికే ఏజ్ 37. అయినా ఆ మిడిలేజీ బ్యూటీ వ‌య్యారాల వడ్డ‌న‌లు కుర్రాళ్ల‌ కంటికి కునుకు ప‌ట్ట‌నివ్వ‌వు. ఇంకా పాతిక ప్రాయం బుల్లెమ్మ‌లా ఆవిడ విరహం జ్వ‌లింప‌జేస్తుంది. నెట్టింట ఇప్ప‌టికే స‌ద‌రు అందాల నాయిక ఫోటోలు - వీడియోల‌కు ఓ రేంజులో గిరాకీ ఉంది. ఇలా ఫోటో కానీ వీడియో కానీ ఇన్ స్టాలోకి రావ‌డ‌మే ఆల‌స్యం.. అలా యూత్ లైక్ లు షేరింగుల‌తో హోరెత్తించేస్తారు. అంత‌టి ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ ఎవ‌రో చెప్పాల్సిన పనే లేదు. ది గ్రేట్ శ్రీయ శ‌ర‌ణ్.

విదేశీ టెన్నిస్ స్టార్ కం బిజినెస్ మేన్ ఆండ్రూ కోశ్చీవ్ ని పెళ్లాడాక కూడా శ్రీ‌య తీరుతెన్నుల్లో ఏమాత్రం మార్పులేదు. అదే వేడి.. అదే స్పీడ్. ఏమాత్రం త‌గ్గ‌డం లేద‌న్న ఐడెంటిటీ ఇప్ప‌టికే ద‌క్కింది. నిరంత‌రం ఏదో ఒక వేడెక్కించే ఫోటోతో శ్రీ‌య అంత‌ర్జాలంలో మంట‌లు పెడుతూనే ఉంది. ప్ర‌స్తుతం లాక్ డౌన్ వేళ‌ శ్రీయ స్వీయ‌ నిర్భంధంలో ఉంది. అది కూడా క‌రోనా భ‌యాన‌కంగా విజృంభిస్తున్న‌ స్పెయిన్ లో అత్త‌గారింట నిర్భంధంలో ఉంది. భ‌ర్త‌ ఆండ్రూ కోశ్చీవ్ తో రొమాంటిక్ క్వారంటైన్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. భ‌ర్త‌తో రొమాన్స్ కి సంబంధించిన ఫోటోల్ని అప్పుడ‌ప్పుడు రివీల్ చేస్తూనే ఉంది.

తాజాగా శ్రీ‌య ఇంటి బాల్క‌నీలో నుంచుని ఇచ్చిన ఫోజు వేడెక్కించేస్తోంది. వెండి సాటిన్ నైట్ టాప్ లో త‌ళుక్కున మెరిసిన శ్రీ‌య అందాల్ని ఆ బ్లాక్ ఇన్నర్ రెట్టింపు చేసింది. కుర్ర‌కారుకు మ‌త్తెక్కించే విజువ‌ల్ ట్రీట్ ని ఇస్తోంది ఈ లుక్. ఓవైపు భ‌ర్త‌కు కొవిడ్ 19 సోకిందేమోన‌న్న బెంగ‌తో ఉన్న శ్రీ‌య‌.. మ‌రోవైపు రొమాన్స్ విష‌యంలో ఏమాత్రం త‌గ్గ‌క‌పోవ‌డంపై యూత్ ఒక‌టే గుస‌గుస‌లాడేస్తున్నారు. ఇంత‌కుముందు ఓ లైవ్ చాట్ లో శ్రీ‌యలోని న్యూడిటీపై అస‌భ్య‌క‌రంగా ప్ర‌శ్నించిన అభిమానిపై సీరియ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. వివాదాల‌తో ప‌నే లేకుండా.. ఆ త‌ర్వాత కూడా ర‌క‌ర‌కాల సెక్సీ ఫోటోలు.. ఫ‌న్నీ వీడియోల్ని శ్రీ‌య షేర్ చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటోంది. ఒక ర‌కంగా త‌నంత ల‌క్కీ లేడీ ఇంకెవ‌రూ లేరేమో! అంటూ ఇత‌ర నాయిక‌ల్ని శ్రీ‌య టీజ్ చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది.