Begin typing your search above and press return to search.

రోమ్ వీధుల్లో స్వీట్ డాట‌ర్ తో మామ్ విహారం!

By:  Tupaki Desk   |   5 Sep 2022 10:33 AM GMT
రోమ్ వీధుల్లో స్వీట్ డాట‌ర్ తో మామ్ విహారం!
X
సోషల్ మీడియాలో శ్రియ యాక్టివిటీస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమాలతో సంబంధం లేకుండా నెటిజనుల్లో..అభిమానుల్లోనూ నిరంతరం హాట్ టాపిక్ గా మారడం అమ్మడి ప్రత్యేకత. ట్రెండీ ఫోటోలను షేర్ చేస్తూ క్రేజీ భామగా యువత గుండెల్లో నిలుస్తుంది. అగ్ర హీరోయిన్ గా రాణిస్తోన్న సమయంలో ఎలాంటి హవా సాగించిందో ఇప్పటికీ బోయ్స్ లో అదే ఫాలోయింగ్ ని మెయింటెన్ చేస్తుంది.

ఏ ఇతర నాయికకు సాధ్యం కానిది శ్రీయకు మాత్రమే సాధ్యమైనది. ఇటీవలే తల్లిగా కూడా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. మాతృమూర్తిగా మారిన అందంలో ఇసుమొత్తు కూడా మార్పు రాలేదు. తాజాగా అమ్మ‌డు స్వీట్ డాట‌ర్ రాధ‌తో రోమ్ వీధుల్లో ఆడుకుంటోన్న ఓ వీడియోని షేర్ చేసి అభిమానుల్లో ఖుషీని నింపింది. డాట‌ర్ రాధతో రోమ్‌ వీధుల అందాల్ని ఆస్వాదిస్తూ చుట్టేస్తుంది.

పాపాయిని ఎత్తుకుని ఆడిస్తూ..లాలిస్తూ అమ్మ ప్రేమ‌ని చాటుతుంది. అదే స‌మ‌యంలో శ్రియ డిజైన‌ర్ దుస్తులు సైతం అంతే హైలైట్ అవుతున్నాయి. రోమ‌న్ మోడ‌ల్స్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా అమ్మ‌డు ఆద్యంతం ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో ఆక‌ట్టుకుంటుంది.

ట్రెడిషనల్‌ డ్రస్‌ల్లో ఫ్యాష‌న్ ప్రియుల్ని అల‌రిస్తుంది. దానికి సంబంధించిన వీడియోని సైతం షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కెరీర్ పీక్స్ లో ఉండగానే శ్రియ‌ 2018లో రోమ్‌కు చెందిన ఆండ్రూ కొశ్చివ్‌ను వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌టికే అమ్మ‌డి సినిమా కెరీర్ డౌన్ ఫాల్ ల్లో ఉంది. అడ‌ద‌డ‌పా సినిమాలు చేయ‌డం మిన‌హా సీరియ‌స్ గా కె రీర్ సాగ‌లేదు. ఈ క్ర‌మంలోనే పెళ్లి ఆ త‌ర్వాత ధాంప‌త్య జీవితంలో బిజీ అవ్వ‌డం జ‌రిగింది. అటుపై మాతృమూర్తిగా మారింది. అయితే మ‌ళ్లీ అమ్మ‌డు సినిమాల‌పై దృష్టి పెట్టింది.

ప్ర‌స్తుతం బాలీవుడ్ లో 'దృశ్యం-2'లో నటిస్తోంది. 'తడ్కా' అనే మరో చిత్రంతో పాటు కొత్త ప్రాజెక్ట్ లు షురూ చేసినట్లు సమాచారం. అలాగే కన్నడ..తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది. ఇటీవలే రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' లో శ్రియ నటించిన సంగతి తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.