Begin typing your search above and press return to search.

గిరగిర తిరుగుతూ తెగ రెచ్చిపోయిందే

By:  Tupaki Desk   |   5 Feb 2017 12:49 AM IST
గిరగిర తిరుగుతూ తెగ రెచ్చిపోయిందే
X
ఫ్యాషన్ వీక్ అంటేనే అందాల హరివిల్లు. దేశంలో ఉన్న అందాల భామలందరినీ ఏరికోరి ఎంపిక చేసి.. వారితో అల్ట్రా మోడర్న్ డిజైనర్ డ్రెస్సులు వేయించి అందాల విందు చేయించడమే వీటి అసలైన ఉద్దేశ్యం. తాజాగా ముంబైలో జరుగుతున్న లాక్మే ఫ్యాషన్ వీక్ కూడా ఇలాంటి వాటిలో భాగమే కానీ.. ఇండియాలో జరిగే ఫ్యాషన్ షోస్ అన్నిటిలోకి ఇదే టాప్ అని ఫ్యాషన్ ప్రియుల ఒపీనియన్.

తాజాగా లాక్మే ఫ్యాషన్ వీక్ లో సౌత్ బ్యూటీ శ్రియా శరణ్ చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది. స్నఫ్ కలర్ స్లీవ్ లెస్ డిజైనర్ టాప్.. హాఫ్ వైట్ బెల్ బాటమ్ ప్యాంట్ ధరించిన శ్రియ.. ఫ్రంట్ ఓపెన్ ట్రాన్స్ పరెంట్ ఓవర్ కోట్ తో అందాలను పరిచింది శ్రియ. ఇక మ్యాచింగ్ ఫుట్ వేర్.. గోల్డ్ కలర్ లో మెరిసిపోతున్న వాలెట్.. అదనపు అట్రాక్షన్. అయితే.. శ్రియ ర్యాంప్ మీదకు రాగానే.. ఫోటోగ్రాఫర్స్ నుంచి బోలెడన్ని డిమాండ్స్ వచ్చేశాయి.

అలా పోజ్ ఇమ్మని.. ఇలా తిరగాలని.. ర్యాంప్ పైనే గిరగిరా రౌండ్లు కొట్టించేశారు. పలుమార్లు గిరగిరా తిరిగిన తర్వాత.. ఇక చాల్లే అన్నట్లుగా వేలితో సున్నితంగా బెదిరించేసి మెల్లగా జారుకుంది శ్రియ. 34 ఏళ్ల వయసులో కూడా ట్వంటీస్ లో ఉన్న భామలకు పోటీ ఇస్తోందంటే.. దటీజ్ శ్రియ అనాల్సిందే కదూ.