Begin typing your search above and press return to search.

#శ్రీయ‌.. జ‌ల‌కాలాట‌ల‌లో ఏమి హాయిలే హ‌లా

By:  Tupaki Desk   |   22 Jun 2021 6:38 AM GMT
#శ్రీయ‌.. జ‌ల‌కాలాట‌ల‌లో ఏమి హాయిలే హ‌లా
X
జలకాలాటలలో గల గల పాటలలో.. ఏమి హాయిలే హలా.. అహ ఏమి హాయిలే హలా.. ఏమి హాయిలే హలా...

ఉన్నది పగలైనా అహ వెన్నలెకురిసేనె... ఉన్నది పగలైనా అహ వెన్నలెకురిసేనె... అహ వన్నె చిన్నెల కన్నె మనసులు కన్న వలపు విరిసే.. అహ వన్నె చిన్నెల కన్నె మనసులు కన్న వలపు విరిసే...

నాటి మేటి క్లాసిక్ మూవీ `జగదేకవీరుని కథ`లోని ఈ పాట‌లో స‌రోజా దేవి జ‌ల‌కాల‌ను తెలుగు ప్రేక్ష‌క మ‌హాశ‌యులు అంత తేలిగ్గా మ‌రువ‌లేరు. పి.లీల- పి.సుశీల బృందం గానాలాప‌నా క్లాసిక్ గా నిలిచిపోయింది. అయితే ఈ పాట‌ను ఇప్పుడే ఎందుకు త‌ల‌వాలి? అంటే ఇక్క‌డ అందాల శ్రీయ‌శ‌ర‌ణ్ జ‌ల‌కాలు అందుకు స్ఫూర్తినిస్తోంది. వేస‌వి కాలం ఊళ్లో సెల‌బ్రిటీలంతా మాల్దీవుల విహారానికి వెళుతుంటే శ్రీయ మాత్రం అందుబాటులో ఉన్న త‌టాకాన్ని జ‌ల‌కాల‌కు స‌ద్వినియోగం చేసుకుంద‌నే అర్థ‌మ‌వుతోంది.

ఆ చెరువులో జ‌న‌ప‌నార మొక్క‌లు చూస్తుంటే నేను ప‌క్కా లోక‌ల్ అని శ్రీయ పొంగిపోతున్న‌ట్టే క‌నిపిస్తోంది. అలా జాలీ న‌వ్వేస్తూ ఫుల్ గా వేస‌వి తాపాన్ని తీర్చుకునేందుకు జ‌ల‌కాలాడేస్తున్న‌ట్టుగా ఉంది. మొత్తానికి హాట్ కంటెంట్ ప‌రంగానూ శ్రీ‌య ఎక్క‌డా త‌గ్గ‌లేదు. నెవ్వర్ బిఫోర్ అనే రేంజు బికినీ ధ‌రించింది. ప్ర‌స్తుతం ముంబైలో భ‌ర్త ఆండ్రూతో క‌లిసి మ‌కాం వేసిన శ్రీయ బాలీవుడ్ స‌హా ద‌క్షిణాది పైనా దండెత్తే ప్లాన్ లో ఉన్న సంగ‌తి తెలిసిన‌దే.