Begin typing your search above and press return to search.

హీరోయిన్ శ్రియా చీర చెంగులు పైకెత్తింది దంచికొట్టింది!

By:  Tupaki Desk   |   30 March 2021 6:10 PM IST
హీరోయిన్ శ్రియా చీర చెంగులు పైకెత్తింది దంచికొట్టింది!
X
శ్రియా శ‌ర‌ణ్ ఎన‌ర్జీ లెవ‌న్స్ ఏంట‌నేది అంద‌రికీ తెలిసిందే. ‘ఇష్టం’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు ఎలాంటి ఫిజిక్ ఉందో.. పెళ్లయ్యేంత వరకూ అదే మెయింటెయిన్ చేసింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు తన అందంతో అలరించిందీ బ్యూటీ.

ఇటీవ‌ల ల‌వ‌ర్ ఆండ్రీ కోస్చీవ్ ను పెళ్లి చేసుకున్న శ్రియ‌.. ఆనంద‌పు అంచుల్లో తేలియాడుతోంది. భ‌ర్త‌తో టూర్లు ప్లాన్ చేస్తూ.. అక్క‌డ ఆడిపాడుతూ.. వాటిని సోష‌ల్ మీడియాలో పోస్టు చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా హోలీ వేడుక‌ల్లో ఈ అమ్మ‌డి చేసిన సంద‌డి చూస్తే ఈల‌వేసి గోల చేయాల్సిందే.

శ్రియ హోమ్ టౌన్ డెహ్రాడూన్‌. ఆ ప్రాంతంలో హోలీని బీభ‌త్సంగా సెల‌బ్రేట్ చేసుకుంటారు. దీంతో.. మొగుడితో క‌లిసి ర‌చ్చ రంబోలా చేసింది శ్రియ‌. మ్యూజిక్ సిస్ట‌మ్ పెట్టుకొని డ్యాన్సులే డ్యాన్సులు. ఆ భాష‌.. ఈ భాష అనే తేడా లేకుండా స్పానిష్ నుంచి హిందీ దాకా.. తెలుగు నుంచి ఇంగ్లీష్ దాకా అన్ని పాట‌ల‌కు అద్దిరిపోయే స్టెప్పులేసింది.

ఈ క్ర‌మంలో చీర చింగులు పైకెత్తి ఈ అమ్మ‌డు వేసిన స్టెప్పులు చూస్తే క‌ళ్లు పెద్ద‌వి చేయాల్సిందే. అంతేకాకుండా.. అంద‌రూ చూస్తుండగానే మొగుడిని కొంగులోదాచి అద‌రాలు చుంభించింది. ఇది చూసిన వారంతా ఈల వేసి గోల చేశారు. ఈ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇది చూసిన వారంతా.. కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.