Begin typing your search above and press return to search.

స్టార్ హీరోయిన్ పబ్లిక్ రొమాన్స్.. వీడియో వైరల్!

By:  Tupaki Desk   |   8 March 2021 5:54 AM GMT
స్టార్ హీరోయిన్ పబ్లిక్ రొమాన్స్.. వీడియో వైరల్!
X
ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు దశాబ్దాలు గడిచినా అదే గ్లామర్ తో ప్రేక్షకుల మనసుల్లో వారి స్థానం అలాగే కాపాడుకుంటారు. అలాంటి బ్యూటీలలో ఒకరు శ్రీయశరణ్. దాదాపు రెండు దశబ్దాలుగా అమ్మడు అందాలతో సౌత్ సినీ ఇండస్ట్రీలను షేక్ చేస్తోంది. కెరీర్ పరంగా అన్ని అనుభవాలను టచ్ చేసిన ఈ వయ్యారి.. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. అయితే కొద్దీకాలం క్రితం రష్యన్ కుర్రాడు ఆండ్రూని పెళ్లి చేసుకున్న శ్రియ.. ప్రస్తుతం వైవాహిక జీవితం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. తను ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రకటిస్తోంది. అందుకే నిత్యం వార్తలలో నిలుస్తుంది ఈ స్టార్ పెయిర్. పెళ్లయ్యాక సినిమాలు కాస్త తగ్గించింది శ్రీయ.

కానీ అడపాదడపా పలు సినిమాలలో మెరుస్తూనే ఉంది. ప్రస్తుతం భర్తతో కలిసి షికారు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది. తాజాగా శ్రియ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసి ఫ్యాన్స్ అందరికి మరోసారి షాకిచ్చింది. తన భర్తతో కలిసి లిప్ కిస్ చేసుకున్న వీడియో షేర్ చేసింది. శ్రీయ కూడా భర్తతో గాడంగా చుంబనంలో మునిగి తేలుతున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అలాగే తాజాగా ఈ జంట రష్యన్ వీధుల్లో చిందులేస్తూ వీడియో పోస్ట్ చేశారు. చూస్తుంటే శ్రీయ అసలు భర్తతో ఉంటే పబ్లిక్ ప్లేస్ అని కూడా చూడకుండా రొమాన్స్ చేసేస్తోంది. ఇప్పటికే చాలాసార్లు అమ్మడు సోషల్ మీడియాను హీటేక్కించింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే శ్రీయ త్వరలో ఆర్ఆర్ఆర్ సినిమాలో కనిపించనుంది.