Begin typing your search above and press return to search.

ఫేమస్ షో లో సందడి చేసిన శ్రియ.. ఇంకా ఏమాత్రం తగ్గలేగా!

By:  Tupaki Desk   |   13 Nov 2022 12:35 PM IST
ఫేమస్ షో లో సందడి చేసిన శ్రియ.. ఇంకా ఏమాత్రం తగ్గలేగా!
X
రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్‌ గా ఇష్టం సినిమా తో ఇండస్ట్రీకి దగ్గర అయిన ముద్దుగుమ్మ శ్రియ. ఈ అమ్మడు హీరోయిన్ గా చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలిగిన విషయం తెల్సిందే. వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈ అమ్మడి యొక్క అందాల ఆరబోతకు సౌత్‌ తో పాటు దేశ వ్యాప్తంగా అభిమానులు అయ్యారు.

ఇంగ్లీష్ సినిమా లో కూడా నటించిన ఈ అమ్మడు ఇరవై ఏళ్ల తర్వాత కూడా తన అందంతో ఆకట్టుకుంటూనే ఉంది. నాలుగు పదుల వయసుకు వచ్చిన శ్రియ ఒక బిడ్డకు తల్లిగా కూడా అయ్యారు. అయినా కూడా ఈమె అందం ఏమాత్రం తగ్గలేదు అనేది అభిమానుల మాట. తాజాగా ఈ అమ్మడు దృశ్యం 2 హిందీ వర్షన్ లో హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.

ఆ సినిమా విడుదలకు సిద్ధం అయిన నేపథ్యంలో ప్రమోషన్ లో భాగంగా కపిల్‌ శర్మ షో లో చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు హాజరు అయ్యింది. అజయ్‌ దేవగన్ తో పాటు కీలక పాత్రలో నటించిన టబు కూడా ఈ ప్రమోషనల్‌ కార్యక్రమంలో పాల్గొంది. ముద్దుగుమ్మ శ్రియ ఈ ఎపిసోడ్‌ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ అమ్మడికి చెందిన షో ఫోటో లు వైరల్‌ అవుతున్నాయి. ఎప్పటిలాగే అందమైన లుక్ లో అందరి దృష్టిని ఆకర్షించే కాస్ట్యూమ్స్‌ తో సింపుల్‌ అండ్ స్వీట్‌ లుక్ లో శ్రియ సందడి చేసింది. ఈ ఫోటోలు చూస్తూ ఉంటే ఇప్పటి వరకు ఈ అమ్మడి అందం ఏమాత్రం తగ్గలేదు అని... ఇంకా ఈమె యంగ్‌ హీరోలకు హీరోయిన్ గా నటించే స్థాయి లో అందంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.