Begin typing your search above and press return to search.

సీనియర్ హీరోయిన్ మళ్లీ బిజీ

By:  Tupaki Desk   |   3 Sept 2017 11:24 AM IST
సీనియర్ హీరోయిన్ మళ్లీ బిజీ
X
17 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగడమే కాదు.. ఇప్పటికీ జనాలను మెస్మరైజ్ చేసే ఫిగర్ ను కొనసాగించడం.. ఒక్క శ్రియా శరణ్ కు మాత్రమే చెల్లింది. అద్భుతమైన నాట్యగత్తె అయిన ఈమె.. ఇప్పటికీ నాజూకు దేహంతో మెరిసిపోతూ హీరోయిన్ ఆఫర్లను ఒడిసి పట్టేస్తోంది. నందమూరి బాలకృష్ణతో వరుసగా రెండు సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. కొన్ని రోజుల నుంచి పైసా వసూల్ ప్రమోషన్స్ తో ఫుల్లు బిజీగా గడిపేసింది.

పైసా వసూల్ మూవీ కోసం హైద్రాబాద్ లో క్యాంప్ వేసిన ఈ భామ.. ఇలా సినిమా రిలీజ్ కాగానే తన మరుసటి సినిమా పనులు మొదలుపెట్టేయడం విశేషం. యంగ్ హీరోలు నారా రోహిత్.. సుధీర్ బాబు కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరభోగ వసంతరాయలు అనే టైటిల్ పై ఈ మూవీ తెరకెక్కనుండగా.. ఇందులో ప్రధాన పాత్రను సీనియర్ బ్యూటీ శ్రియ పోషిస్తోంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రానికి.. ప్రస్తుతం హైద్రాబాద్ లో ఓ కీలక షెడ్యూల్ ని చేస్తున్నారు. ఈ ముగ్గురు నటులకు ఆఫ్ స్క్రీన్ లో కూడా మంచి పరిచయం ఉండడంతో.. షూటింగ్ స్పాట్ అంతా మంచి సందడిగా కొనసాగుతోందని అంటున్నారు.

కొత్త దర్శకుడు ఆర్. ఇంద్రనీల్ ఈ వీర భోగ వసంతరాయలు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే.. టైటిల్ చూస్తే ఇదేదో చారిత్రాత్మక చిత్రం అనే ఫీలింగ్ రావచ్చు కానీ.. నిజానికి ఇది ఓ క్రైమ్ థ్రిల్లర్ కావడం విశేషం. వీర భోగ వసంతరాయలు మూవీలో శ్రియ రోల్ అందరికీ షాక్ కొట్టించే రేంజ్ లో ఉంటుందని టాక్. మరోవైపు బాలీవుడ్ తడ్కా రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది శ్రియా శరణ్.