Begin typing your search above and press return to search.

ప‌బ్లిక్ లో మ‌రీ ఇంతగా చెల‌రేగాలా శ్రీయా?

By:  Tupaki Desk   |   3 March 2021 6:30 AM GMT
ప‌బ్లిక్ లో మ‌రీ ఇంతగా చెల‌రేగాలా శ్రీయా?
X
సినిమా అవ‌కాశాలు త‌గ్గే క్ర‌మంలోనే తెలివిగా విదేశీ బోయ్ ఫ్రెండ్ ఆండ్రూ కోశ్చీవ్ ని పెళ్లాడేసింది శ్రీయా. రాజ‌స్తానీ ట్రెడిష‌న్ లో ఈ వివాహం జ‌రిగింది. ఉద‌య్ పూర్ ఉద‌య్ విలాస్ లో ఘ‌నంగా జ‌రిగింది ఈ జంట పెళ్లి. య‌థావిధిగా క్రీడాకారునితో క‌ళాకారిణి వివాహం హాట్ టాపిక్ అయ్యింది.

పెళ్లి త‌ర్వాత శ్రీయ కెరీర్ గురించి ఏమంత ప‌ట్టించుకున్న‌ట్టే క‌నిపించ‌లేదు. ఆండ్రూతో హ‌నీమూన్ మొద‌లు విదేశీ విహార‌యాత్ర‌ల‌తోనే బిజీ బిజీ అయిపోయింది. ప్యారిస్ స్పెయిన్ స‌హా యూరప్ దేశాల్లో సంచ‌రిస్తూ అక్క‌డినుంచి భ‌ర్త‌తో సెల‌బ్రేష‌న్ లో ఉన్న‌ లైవ్ వీడియోల‌ను ఫోటోల‌ను ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది. అవ‌న్నీ వైర‌ల్ గా దూసుకెళ్లాయి.

ప్ర‌స్తుతం ఈ భామ హ‌బ్బీతో క‌లిసి మ‌రో కొత్త దేశానికి వెళ్లింది. అక్క‌డి నుంచి లైవ్ లిస్తూ కుర్ర‌కారును తెగ టీజ్ చేస్తోంది. పెరూలోని ఏడో వింత మ‌చుపిచు వ‌ద్ద సంచ‌రిస్తోంది శ్రీయా. ప‌చ్చిక‌బ‌య‌ళ్ల‌తో సుంద‌ర‌మైన ఆ స్పాట్ నుంచి ఇంత‌కుముందు ఓ ఫ‌న్నీ వీడియోని షేర్ చేయ‌గా అది వైర‌ల్ అయ్యింది.

తాజాగా హ‌బ్బీ ఆండ్రూతో రొమాంటిక్ ఫోజును ఇన్ స్టాలో రిలీజ్ చేసింది. లిఫ్ట్ మీ అప్ బేబీ! అంటూ ఘాటైన వ్యాఖ్య‌నే జోడించింది ఈ ఫోటోకి. ప్ర‌స్తుతం ఈ ఫోజు ఇంట‌ర్నెట్ లో సునామీ స్పీడ్ తో దూసుకుపోతోంది. అస‌లు ప‌బ్లిక్ లో ఆ భంగిమలు ఏమిటో శ్రీయా? అంటూ అభిమానులు కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఎంత బోల్డ్ అయినా.. మ‌రీ ఇంత టూమ‌చ్ గా చెల‌రేగాలా .. ఆ కామ‌సూత్ర భంగిమ‌లేమిటో!! అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. శ్రీ‌య ఆల్మోస్ట్ పాక్షిక వ‌స్త్రాల‌నే ధ‌రించి ఇలా బీచ్ ప‌రిస‌రాల్లో చెల‌రేగిపోతుండ‌డం కాక‌లు పుట్టిస్తోంది.

శ్రియ ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్ తో పాటు ఐదు భాష‌ల్లో విడుద‌ల కానున్న `గ‌మ‌నం`లో న‌టిస్తోంది. వీటితో పాటు త‌మిళంలో చేస్తున్న `న‌ర‌గాసుర‌న్` విడుద‌ల కావాల్సి వుంది.