Begin typing your search above and press return to search.

33 ఏళ్లొచ్చినా ఇంకా హీరోయినే!!

By:  Tupaki Desk   |   6 April 2016 9:00 PM IST
33 ఏళ్లొచ్చినా ఇంకా హీరోయినే!!
X
30 ఏళ్ల వయసు దాటాక హీరోయిన్ గా కంటిన్యూ కావడం చాలా కష్టమైన విషయం. బాగా సక్సెస్ అయిన బాలీవుడ్ భామలు కొంతమంది ఇలా కంటిన్యూ అవుతారు కానీ.. 33 ఏళ్ల వయసులో టాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగడం చాలా కష్టమైన విషయం. శ్రియా శరణ్ వయసు ప్రస్తుతం 33 సంవత్సరాలు.

సాధారణంగా ఈ ఏజ్ వచ్చేసరికి.. కేరక్టర్ ఆర్టిస్టుగా మారడమో.. లేడీ ఓరియెంటెడ్ ఆఫర్లేమైనా వస్తే చేయడమో లాంటి వాటికి పరిమితం కావాలి. కానీ శ్రియకి మాత్రం ఇంకా హీరోయిన్ ఆఫర్స్ వస్తున్నాయి. రీసెంట్ గా ఊపిరిలో మెరిసిన శ్రియ.. ప్రకాష్ రాజ్ హిందీలో రూపొందిస్తున్న తడ్కా చిత్రంలో నానా పటేకర్ కి హీరోయిన్ గా నటించనుంది. ఈమెతో పాటే కాదు.. ఈమె తర్వాత వచ్చిన భామలు కూడా ఇండస్ట్రీ నుంచి కనుమరుగు అయిపోయినా... శ్రియ ఇంకా హీరోయిన్ గా కంటిన్యూ కాగలగడానికి ముచ్చటగా మూడు కారణాలు ఉన్నాయని చెప్పచ్చు.

అందులో మొదటిది శ్రియ అందం. ఏజ్ కనిపించనివ్వని అందం శ్రియ సొంతం. ఇక రెమ్యునరేషన్‌ కూడా తక్కువ. ఈ విషయంలో పెద్దగా పట్టింపులు లేకపోవడం కలిసొచ్చే విషయం. అలాగే ఎటువంటి కాస్ట్యూమ్‌ అయినా వేసేందుకు సిద్ధపడ్డం, ఎలాంటి రోల్‌ అయినా రెడీగా ఉండే ఫ్లెక్సిబిలటీ.. శ్రియకు ఇంకా హీరోయిన్ ఆఫర్స్ తెచ్చిపెడుతున్నాయి. ఇంకొన్నేళ్లు శ్రియ తన సెక్సీ ఫిగర్ కాపాడుకోవడం ఖాయమని చెప్పచ్చు.