Begin typing your search above and press return to search.
పెళ్లయినా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదుగా..!
By: Tupaki Desk | 8 May 2020 8:00 AM ISTసౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌లలో ఒకరు శ్రియా శరణ్. ప్రస్తుతం తన భర్తతో వైవాహిక జీవిత మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. అందమైన హీరోయిన్ గానే కాదు పెళ్లయ్యాక ఓ మంచి భార్యగా కూడా నడుచుకుంటుందట. పెళ్ళైనా కానీ సినిమాలకు గుడ్ బై చెప్పకుండా.. అడపాదడపా వెండితెర పై మెరుస్తూనే ఉంది. మంచి స్క్రిప్ట్ ఉంటే.. సినిమాకు ఓకే చెప్తా అంటుందట. ఈ మధ్య తెరపై శ్రీయ కనిపించడం తగ్గింది. ఈ సందర్భంగా శ్రియను అవకాశాలు రావడం లేదా.. లేక మీరే సినిమాలను వదిలేశారా? ప్రత్యేక గీతాలకు అయితే ఓకే చేస్తున్నారు? అని అడిగిన ప్రశ్నలకు శ్రియ ఇలా సమాధానం ఇచ్చింది.. ‘‘మనకు వచ్చే పాత్రలన్నీ ఆలోచించకుండా ఓకే చేయకూడదు. అదీగాక కొంతమంది దర్శకనిర్మాతలు ఫస్ట్ లో చెప్పే కథ ఒకటి.. తర్వాత తీసే విధానం మరోలా ఉంటుందని చెప్పింది.
ఇక లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన శ్రియ.. తన భర్తతో ఎంజాయ్ చేస్తుంది. అమ్మడు పెళ్ళైనా అందాల ఆరబోత మాత్రం తగ్గించలేదు. ఎప్పటికప్పుడు అభిమానులను తన అందాల మైకంలో ముంచెత్తుతుంది. శ్రియకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మాములుగా లేదు. లక్షల్లో ఎప్పుడెప్పుడు శ్రియ ఫోటో పోస్ట్ చేస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో లాక్ డౌన్లో తన ఇంటి ఆవరణలో స్టైల్ గా దిగిన ఫోటోలను పోస్ట్ చేసి ఫ్యాన్స్ అందరికి ట్రీట్ ఇస్తుంది. ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు పూర్తయినా అమ్మడి ఒంపు సొంపులలో ఎలాంటి మార్పు రాలేదు. అదే నాజూకు తనం ఇప్పటికి ఉట్టిపడుతుంది. బ్లాక్ డ్రెస్ లో తెల్ల తోలుతో ఏంజెల్ లా ఉందంటూ.. ఫ్యాన్స్ నచ్చిన కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.