Begin typing your search above and press return to search.
ఫొటోటాక్‌ః పబ్లిక్ ప్లేస్ లో హీరోయిన్ లిప్ కిస్
By: Tupaki Desk | 28 Jan 2021 2:00 PM ISTటాలీవుడ్ లో సుదీర్ఘ కాలం స్టార్ హీరోయిన్ గా కొనసాగడంతో పాటు తమిళం మరియు హిందీల్లో కూడా పలు సినిమాలు చేసి ఇంకా కూడా సినిమాల్లో నటిస్తూ ఉన్న ముద్దుగుమ్మ శ్రియ శరన్ పెళ్లి తర్వాత సినిమాల్లో కాస్త తక్కువ అయ్యి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తుంది. వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్ ను కాదనకుండా చేస్తూనే ఉన్న శ్రియ శరన్ తన భర్తతో కలిసి సోషల్ మీడియాలో రెగ్యులర్ గా సందడి చేస్తూనే ఉంది. భర్త ఆండ్రూతో కలిసి ఈమె చేసే ఫన్ మరియు రొమాంటిక్ ఫొటో షూట్ మరియు వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ స్టార్ కపుల్ ఇప్పటికే చాలా సార్లు రొమాంటిక్ ఫోజ్ లతో సోషల్ మీడియాలో హీట్ పుట్టించారు. ఇప్పుడు మరో ఫొటోతో హాట్ టాపిక్ అయ్యారు.
తాజాగా శ్రియ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటో మళ్లీ ట్రెండ్డింగ్ లో నిలిచింది. పబ్లిక్ ప్లేస్ లో శ్రియ మరియు ఆండ్రూ మళ్లీ రొమాన్స్ చేశారు. ఒకరిపై ఒకరు ముద్దులు కురిపించుకున్నారు. ఏకంగా లిప్ లాక్ చేసి దాన్ని కాస్త ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ఫొటోకు మిశ్రమ స్పందన వస్తుంది. మీ ప్రేమను ఇలా ప్రదర్శించాల్సిన అవసరం ఉందా అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే మరి కొందరు మాత్రం మీ జంట చూడ చక్కగా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి ఈ ఫొటో మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.