Begin typing your search above and press return to search.
'వీర భోగ..': గగనసఖిగా మారిన శ్రియ
By: Tupaki Desk | 20 July 2018 12:41 PM ISTమనం మాట్లాడే మాటల్లో సగానికి పైగా ఇంగ్లీష్ పదాలుంటాయి.. ఈ కాలంలో ఇదంతా 'కామనే' అన్నట్టుగా అదికూడా తెలుగే అనుకుని సరిపెట్టుకోవచ్చు గానీ తెలుగు భాషపై ప్రేమతో చాలా ఇంగ్లీష్ పదాలకి సమానమైన తెలుగు పదాలను వాడుకలోకి తెస్తున్నారు భాషా ప్రేమికులు. అలాంటి పదాల్లో గగన సఖి ఒకటి. ఎయిర్ హోస్టెస్ కు తెలుగు పదం.
ఇప్పుడు ఈ గగనసఖి గోల మనకెందుకంటారా? అదిగో సరిగ్గా అదే పాయింట్ లోకే వెళ్తున్నాం మనం. హీరోయిన్ శ్రియ 'వీరభోగ వసంతరాయలు' సినిమా కోసం ఎయిర్ హోస్టెస్ గా మారింది. నారా రోహిత్ - శ్రీ విష్ణు - శ్రీనివాస్ రెడ్డి ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాలో శ్రియ పాత్ర కూడా చాలా కీలకమైనదట. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన రెండు ఫోటోలు లీకయ్యాయి. ఆ ఫోటోలలో శ్రియ డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తోంది. ఈ రోల్ కోసం శ్రియ రియల్ ఎయిర్ హోస్టెస్ లు ఎలా ఉంటారో అలాగే తనను తాను మార్చుకుంది. న్యూ హెయిర్ స్టైల్.. న్యూ కాస్ట్యూమ్ లో సరికొత్తగా కనిపిస్తోంది.
శ్రియ పోయనేడాది తన రష్యన్ బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తన పెళ్ళైన తర్వాత రిలీజ్ కానున్న కొత్త సినిమానే 'వీర భోగ వసంత రాయలు'. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమాకు R. ఇంద్రసేన దర్శకత్వం వహిస్తున్నాడు. B. అప్పారావు ఈ సినిమాను బాబా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.
