Begin typing your search above and press return to search.

శ్రియ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు

By:  Tupaki Desk   |   13 Sep 2020 3:34 AM GMT
శ్రియ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు
X
2001 సంవత్సరంలో హీరోయిన్‌ గా పరిచయం అయిన శ్రియ దాదాపు 20 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. నాలుగు పదుల వయసు దగ్గర పడుతుంది.. పెళ్లి కూడా చేసుకుంది. అయినా ఈమెను తెలుగు ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉన్నారు. ఆశ్చర్యంగా ఈమెకు ఇంకా వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. పెద్ద సినిమాల నుండి చిన్న సినిమాల వరకు ఆమెకు ఏదో ఒక విధంగా చోటును ఇస్తూనే ఉన్నాయి. కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే అని కాకుండా అన్ని భాషల సినిమాల్లో కూడా తన సత్తా చాటుతూ నటిస్తూ వస్తోంది. తాజాగా ఈమె 'గమనం' అనే సినిమాలో నటిస్తోంది.

తెలుగుతో పాటు సౌత్‌ అన్ని భాషల్లో హిందీలో కూడా విడుదల చేయబోతున్నారు. సినిమాలోని ఆమె లుక్‌ ను ఆమె బర్త్‌ డే సందర్బంగా విడుదల చేయడం జరిగింది. చాలా నాచురల్‌ గా ఎప్పటిలాగే శ్రియ మళ్లీ ఆకట్టుకుంది. ఏమాత్రం ఆమెలో వయసు తాలూకు ఛాయలు కనిపించడం లేదు. ఆమె ఈ సినిమాలో మూగ గ్రామీన మహిళ పాత్రలో కనిపించబోతుంది. అందుకు సంబంధించిన లుక్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. సోషల్‌ మీడియా ద్వారా దర్శకుడు క్రిష్‌ విడుదల చేసిన ఈ ఫొటోలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తప్పకుండా ఇదో మంచి సినిమా అవుతుందని అంటున్నారు.

శ్రియ మరో వైపు టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత శ్రియ మరో అయిదు ఏళ్ల పాటు ఇండస్ట్రీలో సందడి చేయడం కన్ఫర్మ్‌ గా అనిపిస్తుంది.