Begin typing your search above and press return to search.

ఔను.. శ్రియ తెలుగు సినిమాలో కనిపించింది

By:  Tupaki Desk   |   26 March 2016 3:13 PM IST
ఔను.. శ్రియ తెలుగు సినిమాలో కనిపించింది
X
హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. హీరోల్లాగా దశాబ్దాలకు దశాబ్దాలు ఇండస్ట్రీలో పాతుకుపోవడం కష్టం. గ్లామర్ కొంచెం తేడా వచ్చిందంటే వాళ్ల పనైపోతుంది. స్టార్ హీరోయిన్లుగా ఎంతో కాలం చెలమణీ కావడం సాధ్యం కాదు. మహా అయితే ఓ పదేళ్లు ఇండస్ట్రీలో నిలిచినా గొప్పే. అందుకే కెరీర్ కొంచెం డల్ అవడం ఆలస్యం.. ఎవరో ఒక బిగ్ షాట్ ను చూసుకుని పెళ్లి చేసుకుని సెటిలైపోతుంటారు హీరోయిన్లు. ఐతే కొందరు మాత్రం ఇండస్ట్రీని వదలడానికి ఇష్టపడరు. అవకాశాలు తగ్గిపోయినా.. ఇక్కడే ఉంటారు. శ్రియా సరన్ ఆ కోవకే చెందుతుంది. తెలుగులోనే కాక అన్ని భాషల్లోనూ ఆమె కెరీర్ చరమాంకానికి వచ్చేసింది. ఆమెకు హీరోయిన్ గా ఛాన్సులిచ్చేందుకు ఆస్కారమే లేదిప్పుడు.

తెలుగులో ఆమె చేసిన చివరి సినిమా ‘గోపాల గోపాల’లో కూడా మిడిలేజ్డ్ క్యారెక్టరే. ఆ సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. మధ్యలో ఇంకే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు ఈ డెహ్రాడూన్ భామ. ఐతే అనుకోకుండా ‘ఊపిరి’ సినిమాలో కనిపించి సర్ ప్రైజ్ చేసింది శ్రియ. ఇందులో వీల్ ఛైర్ కు పరిమితమైన నాగ్ ను ప్రేమించి.. అతడి బాధ్యతలు తీసుకునే అమ్మాయిగా కనిపించింది శ్రియ. ఐతే ఆమె సినిమాలో కనిపించేది కేవలం రెండు నిమిషాలు మాత్రమే. ప్రథమార్ధంలో ఓ నిమిషం.. క్లైమాక్స్ లో ఓ నిమిషం మాత్రమే కనిపిస్తుంది శ్రియ. ఐతే అసలు సినిమాలే లేక జనాలు పూర్తిగా శ్రియను మరిచిపోతున్న టైంలో.. ఈ మాత్రం అవకాశమైనా వచ్చినందుకు ఆమెకు సంతోషమే.