Begin typing your search above and press return to search.
ఆయన్ని కొంగున కట్టేసుకుని ముంబైలో శ్రీయ గృహప్రవేశం!
By: Tupaki Desk | 17 Sept 2021 10:00 AM ISTకోవిడ్ కి ముందు రష్యాకు చెందిన బిజినెస్ మేన్.. అండ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఆండ్రూ కోస్చీవ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీయ దేశ వ్యాప్తంగా వున్న తన అభిమానులకు షాకిచ్చింది. ఊహించని విధంగా విదేశీయుడిని వివాహం చేసుకోవడంతో అంతా అవాక్కయ్యారు. 2018లో మార్చి 19న శ్రియా వివాహం జరిగింది. విదేశీయుడిని వివాహం చేసుకున్నా భారతీయ సంప్రదాయం ప్రకారమే వివాహం జరగడం విశేషం.
కోవిడ్ టైమ్ లో బార్సీలోనాలో చిక్కుకు పోయిన ఈ జంట అక్కడ ఓ రకంగా చెప్పాలంటే నరకాన్ని చూశారట. ఆండ్రూకి కోవిడ్ సోకడంతో శ్రియ నరకాన్ని చూడాల్సి వచ్చిందట. దేశం కాని దేశంలో ఆపద సమయంలో ఇలా బాధలు పడటం కంటే స్వదేశంలోనే తన వాళ్ల కళ్ల ముందు వుండటమే మంచిదని భావించిన శ్రియా శరణ్ ఆమె భర్త ఆండ్రీ కోస్చీవ్ ఇటీవల భారతదేశానికి మకాం మార్చారు. ఆమె ముంబైలో కొత్త ఇంటిని తన చిరునామాగా మార్చేసుకుంది.
ఆమె ముంబైలోని అత్యం పోష్ ఏరియా అయిన బాంద్రాలో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. తాజాగా అందులోకి భర్తతో సహ మకాం మార్చేసింది. శ్రియది ఢిల్లీ.. కానీ కుటుంబం మొత్తం ముంబైకి షిఫ్ట్ అయింది. వారికి ఇన్నాళ్లూ దూరంగా వున్న శ్రియ తాజాగా ముంబైకి మకాం మార్చేసింది. తాజాగా కొత్త ఇంటిలోకి ప్రవేశించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఇకపై శ్రియ ఆమె భర్త ముంబైలో నివసించబోతున్నారు.
2018 లో ఆండ్రీని వివాహం చేసుకున్న తర్వాత శ్రియ తన భర్తతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి స్పెయిన్ వెళ్లింది. ఆమె భర్త స్పెయిన్ లో బిజినెస్ మేన్ కం స్పోర్ట్ పర్సన్. కానీ కోవిడ్ సమమయంలో ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా ఆమె తన మకాంని ముంబైకి మార్చింది. మూడు నెలల అన్వేషణ తరువాత శ్రియ తమ కలల ఇంటిని సొంతం చేసుకుంది. శ్రియ ప్రస్తుతం క్రిష్ నిర్మించిన `గమనం` అనే ఆంథాలజీ డ్రామాతో పాటు రాజమౌళి `ఆర్.ఆర్.ఆర్` లో నటించిన విషయం తెలిసిందే.
శ్రీయ మ్యూజిక్ స్కూల్ పాఠాలు..!
శ్రియ శరన్ కొత్త తెలుగు సినిమా `మ్యూజిక్ స్కూల్` ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. రంగ్ దే బసంతి.. 3 ఇడియట్స్ .. గోల్‌మాల్ ఫ్రాంచైజ్ చిత్రాలతో యువనటుడు శర్మాన్ జోషి ఇందులో కథానాయకుడు. మ్యూజిక్ స్కూల్ చిత్రంతో అతడు టాలీవుడ్ లో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం పాన్-ఇండియా కేటగిరీలో విడుదలవుతుంది. ఇందులో ఉత్తరాది దక్షిణాది తారాగణం నటిస్తున్నారు.
శ్రీయ `మ్యూజిక్ స్కూల్`లో బ్రహ్మానందం- ప్రకాష్ రాజ్- సుహాసిని ములే- గ్రేసీ గోస్వామి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అవార్డ్ చిత్రాల దర్శకుడు పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 15 న అధికారికంగా ఈ చిత్రం ప్రారంభమవుతోంది. మ్యూజిక్ స్కూల్ విభిన్న కథాంశంతో రూపొందుతున్న సెటైరికల్ మూవీ. ప్రస్తుత విద్యా వ్యవస్థపై వ్యంగ్య కథాంశమిదని తెలుస్తోంది. పిల్లలను వారి తల్లిదండ్రులు ఇంజనీర్ లేదా డాక్టర్ కావాలని మాత్రమే పెంచుతారు. కళాకారులు కావాలని అనుకోరు..! దీనివల్ల వారిలో కళలు అంతరించిపోతున్నాయి! అనే కోణంలో కథాంశం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుందట. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు.