Begin typing your search above and press return to search.

శ్రియా పెళ్లయిపోయిందిగా

By:  Tupaki Desk   |   28 May 2018 8:26 AM GMT
శ్రియా పెళ్లయిపోయిందిగా
X
అదేంటి శ్రేయ శరన్ పెళ్లి ముచ్చట గతంలోనే చెప్పుకున్నాం కదా మళ్ళి ఇదేంటి అనుకోకండి. ఇక్కడ చెప్పింది శ్రియ భూపాల్ గురించి. ప్రముఖ వ్యాపారవేత్త జివికె మనవరాలు శ్రియా భూపాల్ నిశ్చితార్థం గతంలో అఖిల్ తో జరిగి ఆ తర్వాత పెళ్లి మరికొద్ది రోజుల్లో జరుగుతుంది అనంగా బ్రేక్ అప్ అయిన సంగతి తెలిసిందే. కారణాలు బయటికి చెప్పలేదు కానీ ఏదో జరిగింది అనే దాని గురించి రకారకాల ఊహాగానాలు చెలరేగాయి. అదంతా గతం. అఖిల్ సినిమాల్లో బిజీ అయ్యాడు కానీ శ్రియా భూపాల్ పెళ్లి మాత్రం అయిపోయింది. అపోలో అధినేత ప్రతాపరెడ్డి మనవడు ఉపాసన కజిన్ అనిందిత్ రెడ్డితో ఎవరు ఊహించని వెడ్డింగ్ డెస్టినేషన్ లో పెళ్లి జరిగిపోయింది. ఇతను అపోలోకు సంబంధించిన కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు రేస్ కార్ స్పోర్ట్స్ మెన్ గా నేషనల్ మోటార్ స్పోర్ట్స్ పర్సన్ లాంటి అవార్డులు కూడా గెలుచుకున్నాడు. ఇక శ్రియ భూపాల్ విషయానికి వస్తే తానొక ఫాషన్ డిజైనర్ అన్న సంగతి తెలిసిందే. తన పేరు మీదే శ్రియ సోమ్ అనే సంస్థ కూడా ఉంది.

ఫ్రాన్స్ లో పారిస్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాన్ట్యూ చాంటిల్లి అనే చరిత్రాతక కోట లాంటి ప్రదేశంలో అపోలోతో పాటు జివికె కుటుంబం మొత్తం హాజరు కాగా ఘనంగా పెళ్లి వేడుక చేసుకున్నారు. అపోలో ఫామిలీ కాబట్టి ఉపాసనతో పాటు అక్కడ హాజరైన రామ్ చరణ్ తేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇద్దరు కలిసి తీసుకున్న ఫోటోలు కూడా ఉపాసన షేర్ చేసుకుంది. ఇండియాలో ఆర్భాటాలకు దూరంగా విదేశాల్లో జరిగిన ఈ పెళ్లి ఉపాసన ద్వారానే బయటి ప్రపంచానికి తెలిసింది. ఇక్కడే అయితే మీడియా హడావిడితో పాటు అనవసరమైన వార్తలు అల్లి రచ్చ చేసే అవకాశం ఉంది కనక ఇంత పెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్ ని గుట్టుగా చేయాల్సి వచ్చిందట. ఏదైతేనేం ఒకపక్కా నూతన జంట మరోపక్క చిట్టిబాబు అదే రామ్ చరణ్ కపుల్ తో వేడుక మొత్తం కనులవిందుగా సందడిసందడిగా మారింది. వీటి తాలూకు వీడియోలు మాత్రం బయటికి రాకుండా జాగ్రత్త పడ్డాయి ఇరు కుటుంబాలు