Begin typing your search above and press return to search.

అందులో అఖిల్ మాజీ కేక

By:  Tupaki Desk   |   8 Sep 2017 4:11 AM GMT
అందులో అఖిల్ మాజీ కేక
X
అక్టోబరులో అక్కినేని వారింట పెళ్లి బాజా మోగనుంది. టాలీవుడ్ ఫేవరెట్ యంగ్ కపుల్ హీరో నాగచైతన్య - హీరోయిన్ సమంత గోవాలో పెళ్లికి సిద్ధమవుతున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి ఉంటే వీళ్లిద్దరి పెళ్లి కన్నా ముందే ఇంకో పెళ్లి జరిగి ఉండేది. నాగచైతన్య - సమంతలతో పాటే నాగార్జున రెండో కొడుకు అఖిల్ ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. తన చిన్ననాటి స్నేహితురాలు - హైదరాబాద్ లోని టాప్ బిజినెస్ మెన్ లో ఒకరైన జి.వి.కృష్ణారెడ్డి మనవరాలు శ్రేయా భూపాల్ తో అఖిల్ పెళ్లికి రెడీ అయ్యాడు.

తన కన్నా ముందు అఖిల్ వివాహమే జరుగుతుందని నాగచైతన్య కూడా చెప్పాడు. కానీ అనూహ్యంగా అఖిల్ - శ్రేయా భూపాల్ బ్రేకప్ అయ్యారు. ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. తర్వాత అఖిల్ తన నెక్ట్స్ సినిమా పనిలో బిజీ అయిపోయాడు. నాగేశ్వరరావు చివరి చిత్రంగా అక్కినేని ఫ్యామిలీకి గుర్తుండిపోయే చిత్రాన్ని అందించిన డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో హలో సినిమా చేస్తున్నాడు. అఖిల్ ఎక్స్ ఫియాన్సీ శ్రేయా భూపాల్ కూడా తనకు నచ్చిన రంగంలోకి అడుగుపెట్టింది. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుని ప్రస్తుతం ‘శ్రేయాసమ్’ అనే బ్రాండ్ తో డిజైన్లు అందిస్తోంది.

అఖిల్ ఎంగేజ్ మెంట్ తర్వాత శ్రేయా భూపాల్ అల్లు శిరీష్ తో పార్టీలో కనిపించింది. అయితే ఎలాంటి పుకార్లకు తావివ్వకుండా ఆమె తన సోదరితో సమానమంటూ శిరీష్ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం శ్రేయాభూపాల్ దేశవ్యాప్తంగా జరిగే ఫ్యాషన్ షోలలో తన డిజైన్స్ ప్రదర్శిస్తోంది. నగరంలోని బిజీయెస్ట్ డిజైనర్లలో శ్రియ భూపాల్ పేరు కూడా ఉంది. దాంతోపాటు స్టార్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్ - సమంత లాంటి వారికి అవుట్ ఫిట్స్ డిజైన్ చేస్తోంది. మొత్తానికి ఏదో రకంగా అలా టాలీవుడ్ తో టచ్ లోనే ఉంది.