Begin typing your search above and press return to search.

శ్రియా భూపాల్ పెళ్లిలో తార‌ల సంద‌డి!

By:  Tupaki Desk   |   7 July 2018 1:51 PM GMT
శ్రియా భూపాల్ పెళ్లిలో తార‌ల సంద‌డి!
X
అపోలో సంస్థల అధినేత సీ.ప్ర‌తాప్ రెడ్డి మ‌న‌వ‌డు అనిన్ దిత్ రెడ్డి - ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త జీవీకే రెడ్డి మ‌న‌వ‌రాలు శ్రియా భూపాల్ ల వివాహం శుక్ర‌వారం నాడు క‌న్నుల పండుగ‌గా జ‌రిగింది. ఈ వివాహానికి ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో పాటు - వ్యాపార వేత్త‌లు - క్రీడాకారులు - సెల‌బ్రిటీలు హాజ‌రై నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. ఈ వివాహ వేడుక‌కు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌ చరణ్‌ - ఉపాస‌న‌ - టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌ - మ‌హేష్ గారాల ప‌ట్టి సితార ల‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు హాజ‌రై సంద‌డి చేశారు. ప‌లువురు విశిష్ట అతిథుల మ‌ధ్య అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రిగిన ఈ పెళ్లి వేడుక ఫోటోలు - వీడియోలు సోషల్‌ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

మెగా ఫ్యామిలీ కోడ‌లు ఉపాసనకు అనిన్ దిత్‌ కజిన్ అవుతారు. దీంతో, మెగా క‌పుల్ ఇద్ద‌రూ ఈ వేడుక‌కు హాజ‌రై సందడి చేశారు. మ‌రోవైపు, నమ్రతా శిరోద్కర్ కు శ్రియా వదిన దియా అత్యంత స‌న్నిహితురాలు. దీంతో, నమ్రత - సితార‌లు పెళ్లికి హాజ‌ర‌య్యారు. వీరితోపాటు - టెన్నిస్ స్టార్ సానియా మిర్జా - టాలీవుడ్ హీరోయిన్లు ప్రజ్ఞా జైస్వాల్‌ - లావణ్య త్రిపాఠిలు కూడా పెళ్లిలో త‌ళుక్కున మెరిశారు. అయితే, గ‌తంలో శ్రియా భూపాల్ కు అక్కినేని అఖిల్ తో నిశ్చితార్థమైన త‌ర్వాత కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల పెళ్ళి ర‌ద్ద‌యిన సంగ‌తి తెలిసిందే. ఇరు కుటుంబాలు ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే ఆ వివాహాన్ని ర‌ద్దుచేసుకున్నాయి. అయితే, ఆ పెళ్లి ఎందుకు ర‌ద్ద‌యింద‌న్న కార‌ణాలను ఆ రెండు ఫ్యామిలీలు వెల్ల‌డించ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు.