Begin typing your search above and press return to search.

సీక్రెట్ వెకేష‌న్ నుంచి హీరోయిన్ ప్ర‌యివేట్ ఫోటోలు లీక్

By:  Tupaki Desk   |   30 Jun 2021 3:30 PM GMT
సీక్రెట్ వెకేష‌న్ నుంచి హీరోయిన్ ప్ర‌యివేట్ ఫోటోలు లీక్
X
త‌న‌కు సంబంధించిన ఏ వ్య‌క్తిగ‌త‌ విష‌యాన్ని దాచి ఉంచేందుకు అందాల శ్రీ‌య అంత‌గా ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌రు. గ‌డిచిన మూడేళ్లుగా భ‌ర్త ఆండ్రూ కోశ్చీవ్ తో క‌లిసి యూర‌ప్ విహారంలో ఆస్వాధ‌న‌ల్ని ఈ బ్యూటీ ర‌క‌ర‌కాల ఫోటోలు వీడియోల రూపంలో రివీల్ చేస్తూనే ఉన్నారు.

ఇంత‌కుముందు విదేశాల నుంచి బికినీ బీచ్ వెకేష‌న్స్ స‌హా ప్ర‌పంచంలోని ఏడు వింత‌ల్ని వీక్షించినప్ప‌టి ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. యూర‌ప్ ఆద్యంతం విహార యాత్ర‌ల‌కు సంబంధించిన వీడియోల‌ను శ్రీ‌య వైర‌ల్ చేశారు. మూడేళ్ల సెల‌బ్రేష‌న్ త‌ర్వాత‌ ఇటీవ‌ల తిరిగి క‌థానాయికగా రీఎంట్రీ ఇచ్చేందుకు శ్రీ‌య స‌న్నాహ‌కాల్లో ఉన్నార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం భ‌ర్త‌తో క‌లిసి ముంబైలోనే నివాసం ఉంటున్నారు.

ఆ క్ర‌మంలోనే శ్రీ‌య సోషల్ మీడియా వేడెక్కించే ఫోటోల‌తో జాత‌ర స్థ‌లాన్ని త‌ల‌పిస్తోంది. తాజాగా శ్రీ‌య ప్ర‌యివేట్ సెల‌బ్రేష‌న్ కి సంబంధించిన‌ ఫోటోలు కొన్ని నెటిజ‌నుల్లో వైర‌ల్ గా మారాయి. శ్రీ‌య ఇన్న‌ర్ తో స్విమ్మింగ్ పూల్ లోకి దిగుతున్న ఫోటో.. అలాగే తాను జ‌ల‌కాలాట‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంటే భ‌ర్త ఆండ్రూ ష‌ర్ట్ విప్పుతూ క‌నిపిస్తున్న ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. సోష‌ల్ మీడియాల్లో షేర్ లు లైక్ ల‌తో మోతెక్కిపోతోంది. అయితే ఈ ప్ర‌యివేట్ ఫోటోల్ని శ్రీ‌య‌నే స్వ‌యంగా లీక్ చేశారా.. ఇదేమైనా సెన్సేష‌న్స్ కోసం ప్ర‌య‌త్న‌మా? అన్న‌ది అర్థం కాని గంద‌ర‌గోళంగా ఉంది. ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారిన ఈ ఫోటోలపై యువ‌త‌రం ఆస‌క్తిక‌ర డిబేట్ ని ర‌న్ చేస్తోంది.