Begin typing your search above and press return to search.

ఆ న్యూడ్ ఫోజు ఏంటి అమ్మ‌డు?

By:  Tupaki Desk   |   20 Jun 2022 3:30 PM GMT
ఆ న్యూడ్ ఫోజు ఏంటి అమ్మ‌డు?
X
హాట్ బ్యూటీ శ్రియ ఇన్ స్టాకి ఎప్పుడెక్కినా సంచ‌ల‌నం త‌ప్ప‌నిసరి. ఆ అంశం లేనిదే అమ్మ‌డు సోష‌ల్ మీడియాకి ఎక్క‌దు. సింగిల్ గా వ‌చ్చినా...హ‌బ్బీతో క‌లిసి జంట‌గా వ‌చ్చినా గ్లామ‌ర్ మంట‌లు త‌ప్ప‌నిస‌రి. చేతిలో సినిమాలున్నా..లేక‌పోయినా సోష‌ల్ మీడియాలో స్టార్ హీరోయిన్ త‌రహాలో అటెన్ష‌న్ డ్రా చేయ‌డం లో శ్రియ ప్ర‌త్యేక‌మైన స్ర్టాట‌జీని అనుస‌రిస్తుంది.

ఇటీవ‌లే ఓ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చినా శ్రియ సెగలు నెట్టింట ఎంత‌లా దుమారం రేపుతున్నాయో చూస్తునే ఉన్నాం. తాజాగా అమ్మ‌డు మ‌రోసారి అలాంటి సంచ‌ల‌నానికి తెర లేపి విమ‌ర్శ‌ల పాలైంది.

త‌న గ్లామ్ షోకి బ‌ధులుగా న్యూడ్ గా ఉన్న ఓ మ‌హిళ ఆర్ట్ ని షేర్ చేసింది. ఆ ఫోటోని చేతితో చూపించి మ‌రీ సంచ‌ల‌నానికి తెర తీసింది. ఇక్క‌డ శ్రియ బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న న్యూడ్ పిక్ ని గ‌మనించ‌వ‌చ్చు.

ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట జోరుగా వైర‌ల్ అవుతుంది. దీంతో నెటి జ‌నులు ఒక్క‌సారిగా శ్రియ పై భ‌గ్గుమ‌న్నారు. ప్ర‌స్తుతం శ్రియ టార్గెట్ గా ఒక‌టే విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తుంది. ఓ మ‌హిళ అయి ఉండి మ‌రో మ‌హిళ ఆర్ట్ ని ఇలా షేర్ చేయ‌డం ఏంట‌ని మండి ప‌డుతున్నారు.

మ‌రోవైపు పాజిటివ్ యాంగిల్ లోనూ ప్ర‌శంస‌లొస్తున్నాయి. అందులో త‌ప్పేముంది. ప్ర‌తిభ‌ని గుర్తించి క్రియేటివ్ ఆర్ట్ ని ఇలా ప్ర‌మోట్ చేసింద‌ని మెప్పు పొందుతుంది. కారణాలు ఎలా ఉన్నా? ఈ విష‌యంలో పాజిటివ్ క‌న్నా నెగిటివిటీనే అమ్మ‌డు ఎక్కువ‌గా ఎదుర్కోంటుంది.

శ్రియ సినిమాల విషయానికి వస్తే వ‌య‌సు మీద ప‌డినా అమ్మ‌డికి అవ‌కాశాల ప‌రంగా కొద‌వ‌లేదు. బాలీవుడ్..కోలీవుడ్ ..టాలీవుడ్ అంటూ మూడు భాష‌ల్లోనూ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో 'దృశ్యం-2'లో నటిస్తోంది. అలాగే 'తడ్కా' అనే మరో చిత్రంతో పాటు కొత్త ప్రాజెక్ట్ లు షురూ చేసినట్లు సమాచారం. మ‌రోవైపు కన్నడ..తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది. ఇటీవలే రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం 'ఆర్ ఆర్ ఆర్' లో కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే.