Begin typing your search above and press return to search.

ఇదేం పోయేకాలం శ్రియ.. పబ్లిక్ గా ఆ రొమాన్స్ ఏంది?

By:  Tupaki Desk   |   5 July 2021 3:30 PM GMT
ఇదేం పోయేకాలం శ్రియ.. పబ్లిక్ గా ఆ రొమాన్స్ ఏంది?
X
సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు సెలబ్రిటీలు. గతంలో మాదిరి ఇమేజ్ బిల్డింగ్ కోసం ఎవరినో సాయాన్ని అడగాల్సిన అవసరం లేదు. నలుగురు నోళ్లలో నానటమే లక్ష్యమైనప్పుడు..నిపుణులు సలహాలు.. సూచనలు.. సెన్సార్లు అవసరం లేదు. తోచిన రీతిలో చెలరేగిపోవచ్చు. చాలామంది సెలబ్రిటీలు ఇప్పుడు అదే పని చేస్తున్నారు. పెళ్లైన తర్వాత నుంచి రొమాంటిక్ ఫోటోలు.. వీడియోల్ని షేర్ చేస్తుంటారు శ్రియ దంపతులు. వెండితెరపై గ్లామర్ రసాన్ని చిందించిన శ్రియ.. సోషల్ మీడియాలో అంతకు మించి అన్నట్లుగా చెలరేగిపోతున్నారు.

ఈ బ్యూటీకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఆమె భర్త ఆండ్రీ కోస్చీవ్ మరింత రెచ్చపోతుంటారు. పెళ్లై మూడేళ్ల తర్వాత కూడా నెట్టింట వారు పండిస్తున్న రొమాన్సు తాజాగా హద్దులు దాటేసింది. బోటులో షికారు చేస్తూ.. సముద్రం మధ్యన ఈ కపుల్ రెచ్చిపోయారు. ఒక వీడియోలో మామూలుగా ఉన్నా.. రెండో వీడియోలో మాత్రం.. భర్త కౌగిలిలో ఒదిగిపోవటం.. అతగాడు ఉన్నట్లుండి శ్రియ ఎద అందాల్ని గట్టిగా కిస్ చేయటం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.

వెండితెర మీద సెన్సార్ ఉంటుంది. కానీ..సోషల్ మీడియాలో అలాంటివేమీ ఉండవు కదా? చిన్నపిల్లలు దడుచుకునేలా.. ఈ పబ్లిక్ రొమాన్సు ఏమిటని ఫైర్ అయిపోతున్నారు. తాజా హాట్ వీడియోను ఆండ్రీ కోస్చీవ్ షేర్ చేశారు.తనకున్న ఇమేజ్ రచ్చ అయ్యేలా ఉన్న వీడియోను పబ్లిక్ డొమైన్ లోకి షేర్ చేసేందుకు శ్రియ ఎలా అనుమతి ఇచ్చిందన్న భావన కలగటం ఖాయం. ఇలాంటి వీడియోలతో ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని ఆమె ఎప్పటికి గ్రహిస్తారో. తాజా వీడియోను సంప్రదాయవాదులు చూస్తే.. శ్రియ మీద చిందులేయటం ఖాయం.