Begin typing your search above and press return to search.

తదుపరి మెగాస్టార్‌ అల్లు అర్జున్‌!

By:  Tupaki Desk   |   9 April 2020 6:09 PM IST
తదుపరి మెగాస్టార్‌ అల్లు అర్జున్‌!
X
మెగా కాంపౌండ్‌ లో ఆధిపత్య పోరు కొనసాగుతుందని అప్పుడప్పుడు మీడియాలో పుకార్లు షికార్లు చేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా బన్నీ చరణ్‌ ల మద్య కోల్డ్‌ వార్‌ కొనసాగుతుంది అంటూ చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. చిరంజీవి తర్వాత ఆ స్థానం చరణ్‌ దే అంటూ కొందరు కాదు బన్నీది అంటూ మరికొందరు వాదులాడుకోవడం గతంలో సోషల్‌ మీడియాలో చూశాం. తాజాగా మరోసారి ఆ చర్చ ఒక సింగర్‌ వల్ల జరుగుతోంది.

నిన్న అల్లు అర్జున్‌ బర్త్‌ డే అవ్వడం వల్ల పలువురు ప్రముఖులు సెలబ్రెటీలు స్టార్స్‌ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ప్రముఖ గాయని శ్రేయ ఘోషాల్‌ కూడా బన్నీకి బర్త్‌ డే విషెష్‌ ను చెప్పింది. అయితే ఆమె బన్నీని మెగాస్టార్‌ అల్లు అర్జున్‌ అంటూ సంభోదించడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. హ్యాపీ బర్త్‌ డే మెగాస్టార్‌ అల్లు అర్జున్‌. నీ భవిష్యత్తు అంతా బాగుండాలి బ్లాక్‌ బస్టర్స్‌ నువ్వు అందుకోవాలంటూ ఆమె శుభాకాంక్షలు తెలియజేసింది.

ఆమె ట్వీట్‌ కు బన్నీ స్పందించాడు. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు కృతజ్ఞతలు అంటూ రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్‌ పై అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ చర్చ మొదలు పెట్టారు. తదుపరి మెగాస్టార్‌ అల్లు అర్జున్‌ అంటూ శ్రేయ ఘోషాల్‌ కనిపెట్టింది. ఆమె అన్నట్లుగానే రాబోయే తరంలో ఖచ్చితంగా అల్లు అర్జున్‌ మెగాస్టార్‌ స్థానంను భర్తీ చేస్తాడంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తనను మెగాస్టార్‌ అంటూ సంభోధించగా అంత మాట అనవద్దని తనను మెగాస్టార్‌ తో పోల్చవద్దని అనాల్సిందని బన్నీ పోస్ట్‌ లకు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి మెగాస్టార్‌ అల్లు అర్జున్‌ టాపిక్‌ సోషల్‌ మీడియాలో ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.