Begin typing your search above and press return to search.

బేబీ బంప్‌ తో దర్శనమిచ్చిన ప్రముఖ గాయని..!

By:  Tupaki Desk   |   30 March 2021 2:30 AM GMT
బేబీ బంప్‌ తో దర్శనమిచ్చిన ప్రముఖ గాయని..!
X
ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ తాను తల్లి కాబోతున్న విషయాన్ని ఇటీవలే సోషల్ మీడియా వేదికగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆమె పేరు భర్త శిలాదిత్య పేరు కలిసేలా బేబీ శ్రేయాదిత్య వస్తోందంటూ మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న శ్రేయా.. తాజాగా బేబీ బంప్‌ తో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేసింది. ''నా జీవితంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ని అనుభవిస్తున్నాను. ఇదంతా దేవుడి యొక్క లీల'' అని పోస్ట్ చేసింది శ్రేయా. దీనికి ఆమె ఫాలోవర్స్ స్పందిస్తూ ఆమెకు మరోసారి కంగ్రాట్స్ చెబుతున్నారు. ప్రస్తుతం శ్రేయా ఘోషల్ బేబీ బంప్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కాగా, శ్రేయా ఘోషల్ తెలుగు హిందీ, కన్నడ, తమిళం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ, మళయాళం, అస్సామీ.. ఇలా పలు భారతీయ భాషల్లో పాటలు పాడారు. తెలుగులో ఈ మధ్య 'ఉప్పెన' 'టక్‌ జగదీష్' సినిమాల్లో పాడారు. తన అద్భుతమైన గాత్రంతో అభిమానులు సంపాదించుకున్న శ్రేయా.. అనేక అవార్డులను అందుకుంది. బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ గా నాలుగు నేషనల్ అవార్డ్స్ - 6 ఫిలింఫేర్ అవార్డ్స్ - 9 సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ అందుకుంది. వీటితో పాటు అనేక ప్రాంతీయ అవార్డులను కూడా గెలుపొందింది. శ్రేయా 2015 ఫిబ్రవరి 5న తన స్నేహితుడైన శైలాదిత్య ముఖోపాధ్యాయను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.