Begin typing your search above and press return to search.

శ్రీ‌య ప్ర‌శ్న‌! సహజంగా లిప్ లాక్ వేస్తే ఎందుకీ రాద్ధాంతం?

By:  Tupaki Desk   |   24 Nov 2022 2:30 AM GMT
శ్రీ‌య ప్ర‌శ్న‌! సహజంగా లిప్ లాక్ వేస్తే ఎందుకీ రాద్ధాంతం?
X
జ‌మానా కాలంలో ఏ హాలీవుడ్ సినిమాలోనో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో లిప్ లాక్ వేసే హీరో- హీరోయిన్ల‌ గురించి మాట్లాడుకునేవారు. 80-90ల కాలంలో ప్ర‌జ‌ల అమాయ‌క‌త్వం అలా ఉండేది. సినిమా హాళ్ల‌లో అలాంటి సీన్లు చూసినా ``అయ్యో అప‌చారం`` అనుకునేవారు. అయితే అప్ప‌టికి ఇంగ్లీష్ వాళ్లు భార‌తీయుల కంటే చాలా అడ్వాన్స్ డ్‌. కానీ ఇప్పుడ‌లా కాదు. ప్ర‌పంచీక‌ర‌ణ పుణ్య‌మా అని భార‌త‌దేశం ఆంగ్ల దేశాల‌ను వెన‌క్కి తొక్కి క‌ల్చ‌ర్ ప‌రంగా అడ్వాన్స్ డ్ గా ఉంది. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ప‌బ్లిక్ పార్కుల్లో చెట్టు పుట్టా నీడ‌లోనో లిప్ లాక్ లు వేయ‌డం అనేది నేడు చాలా స‌హ‌జం. ఇదే విష‌యాన్ని శ్రీ‌య కాస్త ట్రెండీ గా చెప్పింది అంతే!!

పాపం శ్రీ‌య హ‌బ్బీ ఆండ్రీ తెలిసో తెలియ‌కో భార్య‌తో అదిరే లిప్ లాక్ వేసాడు. అయితే ఇంకా వెన‌క‌బ‌డిన ఈ మాయ‌దారి నెటిజ‌నం దీనినే అవ‌కాశంగా ఎంచుకున్నారు. శ్రీ‌య‌ను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ ని స్టార్ట్ చేసారు. ఇంత‌లోనే శ్రీ‌య నుంచి కూడా కౌంట‌ర్ ఆ రేంజులోనే ప‌డిపోయింది. ఇంత‌కీ శ్రీ‌య ఏమంది? అంటే....! కాస్త డీప్ గా వివ‌రాల్లోకి వెళ్లాలి.

అందాల భ‌రిణె శ్రియా శరణ్ ఎక్క‌డ ఉన్నా లైమ్ లైట్ లో ఎలా ఉండాలో త‌న‌కు బాగా తెలుసు. గ్లామ‌ర్ ప్ర‌పంచ‌పు క్వీన్ గా పెళ్లి త‌ర‌వాత కూడా ఏలేందుకు ప‌న్నాగం ప‌న్నింది. అది స‌క్సెస‌వుతోంది కూడా. ప్రస్తుతం `దృశ్యం 2` విజయాన్ని ఆస్వాధిస్తోంది. ఈ చిత్రంలో ఈ బ్యూటీ అజయ్ దేవగన్ భార్య పాత్రను పోషించింది. గత కొన్ని రోజులుగా ముంబైలో సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉంది. తరచుగా తన భర్త ఆండ్రీ కొస్చీవ్ తో ముంబై ప్ర‌మోష‌న్స్ లో క‌నిపిస్తోంది.

ఈ జంట మ‌ధ్య రొమాన్స్ కెమిస్ట్రీకి మీడియా ఫిదా అయిపోతోంది. దృశ్యం 2 స్క్రీనింగ్ సమయంలో కూడా ఈ జంట కెమెరాల‌కు పోజులిచ్చేటప్పుడు ఘాటైన లిప్ లాక్ ని లాగించేయ‌డం బోలెడంత ర‌భ‌స‌కు కార‌ణ‌మైంది. అయితే ప‌బ్లిక్ ముందు ఈ భోగోత‌మేంటీ? అంటూ శ్రీ‌య‌ను నెటిజనులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

తాజా ఇంటర్వ్యూలో శ్రియ ట్రోల‌ర్ల‌పై స్పందించింది. ఆ ప్రత్యేక క్షణంలో ఆండ్రీ న‌న్ను ముద్దు పెట్టుకోవడం సాధారణమని భావిస్తున్నాన‌ని అంది. ``ఇది(ట్రోలింగ్) ఒక రకంగా హాస్యాస్పదంగా ఉంది. ఆ ప్రత్యేకమైన సమయంలో నన్ను ముద్దు పెట్టుకోవడం సాధారణమని ఆండ్రీ అనుకున్నాడు. అది అందంగా ఉందని నేను భావిస్తున్నాను. ఇంత సహజమైన దాని కోసం మీరంతా ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారు? ఎందుక‌లా ట్రోలింగ్ చేస్తున్నారో ఆండ్రీకి అర్థం కాలేదు`` అని వాపోయింది శ్రీ‌య‌. అది చాలా స‌హ‌జ ప్ర‌క్రియ అని కూడా వివ‌ర‌ణ ఇచ్చింది. అయినా కానీ అదేమీ(ట్రోలింగ్) ఫర్వాలేదు... బాగానే ఉంది (నవ్వుతూ) . నేను చెడు కామెంట్లు చదవను లేదా వాటికి ప్రతిస్పందించను. రాయడం వారి (ట్రోలు) పని.. వాటిని నివారించడం నా పని. నేను చేయవలసింది మాత్రమే చేస్తాను`` అని చెప్పింది.

సుదీర్ఘ కాలం సినీరంగంలో చ‌క్రం తిప్పిన తెలివైన క‌థానాయిక‌గా శ్రీ‌య‌కు గుర్తింపు ఉంది. ద‌క్షిణాదిన అత్యంత‌ విజయవంతమైన నటీమణులలో శ్రియ ఒకరు. 2007లో `ఆవరపన్‌`తో బాలీవుడ్ లో ఖ్యాతి ఘ‌డించింది. అదే స‌మ‌యంలో ఇష్టం అనే సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైంది. తెలుగు- తమిళం- హిందీ ప‌రిశ్ర‌మ‌ల్లో పనిచేసింది.

శ్రియ తన చిరకాల రష్యన్ ప్రియుడు ఆండ్రీ కొస్చీవ్ ను 12మార్చి 2018లో వివాహం చేసుకుంది. ఈ జంట ఆద‌ర్శ జంట‌గా కొన‌సాగుతున్నారు. వృత్తిగ‌తంగా ఎంత బిజీగా ఉన్నా నిరంత‌రం ఒకరితో ఒకరు నాణ్యమైన సమయాన్ని గ‌డుపుతారు.

సోషల్ మీడియా వేదిక‌గా శ్రీ‌య‌ అభిమానులకు నిరంత‌ర‌ ట్రీట్ ని ఇస్తూ ఉల్లాస‌ప‌రుతోంది. అభిమానుల‌కు చేరువ‌గా ఉండే మంచి స్వ‌భావం ఈ అందాల భామ‌ సొంతం. అందుకే త‌న‌కు ఇన్ స్టా వేదిక‌గా భారీ ఫాలోయింగ్ పెరిగింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.