Begin typing your search above and press return to search.

వర్మ 'నగ్నం' హీరోయిన్ చెప్పిన షాకింగ్ నిజాలు!!

By:  Tupaki Desk   |   1 July 2020 3:30 PM GMT
వర్మ నగ్నం హీరోయిన్ చెప్పిన షాకింగ్ నిజాలు!!
X
రాంగోపాల్ వర్మ రూపొందించిన డిజిటల్ మూవీ "నగ్నం" ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ ను నెల రోజుల్లో పూర్తి చేశామని, కేవలం రెండు వేల రూపాయలతో సినిమాను రూపొందించినట్లుగా వర్మ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఇప్పుడు అదే సినిమాకు సంబంధించి ఆ సినిమాలో నటించిన స్వీటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

స్వీటీ ఒక మీడియా సంస్థ తో మాట్లాడుతూ... తన అసలు పేరు శ్రీ రాపాక. మాది వెస్ట్ గోదావరి జిల్లా. రాం గోపాల్ వర్మ గారు హీరోయిన్ కోసం వెదుకుతున్నట్లుగా తెలిసింది. అప్పటికే ఆయన ఎనిమిది మందిని చూశాడట. వారు ఎవరు నచ్చలేదు. నన్ను ఎలా ఉంటావో అలాగే రామన్నారు. ట్రెడిషనల్ గా వెళ్తే రామ్ గారికి నచ్చదేమో అనుకున్నాను. కానీ ఎలా ఉంటే అలాగే రమ్మన్నారు. అందుకే ట్రెడిషనల్ గా వెళ్ళాను. నన్ను చూసిన తర్వాత ఆయన ఎత్తు అడిగారు. నాకు కథను నరేట్ చేశారు. సినిమా షూటింగ్ రేపటి నుండి అన్నారు. సినిమా నెల రోజులు అన్నారు కానీ రెండు వారల్లోనే పూర్తి అయింది. షూటింగ్ రెండు రోజులు, గంట డబ్బింగ్, మిగిలిన రోజులు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్. ఈ సినిమా లో న్యూడ్ గా నటించాల్సిన అవసరం లేదన్నారు. కానీ కాస్త హాట్ గా కనిపించాల్సి వస్తుందని అన్నాడు. కొన్ని సినిమాలో చూపిన విధంగా కాకుండా మరోలా తీశారు. కానీ అవి మాత్రం ప్రేక్షకులకు నగ్నంగా నటించినట్లుగా అనిపించింది. ఇక ఈ సినిమాలో నటించినందుకు గాను నేను ఎంత అడిగితే అంత ఇవ్వమని చెప్పారట. నేను రెండు రోజులకు రెండు లక్షలు ఇవ్వమని అడిగాను. అది ఇచ్చేశారు. ట్రైలర్ విడుదల తర్వాత కొందరు ఇంకాస్త పారితోషికం డిమాండ్ చేయమన్నారు. కానీ నేను అదేమి చేయలేదు. వర్మ గారు అతి తక్కువ సమయంలోనే సినిమా తీశారు. అందుకే ఆయన ఇండియాలోనే గొప్ప టెక్నీషియన్ అంటూ వర్మ పై ప్రసంశలు కురిపించింది.