Begin typing your search above and press return to search.

పుష్ప 'ఐటమ్ సాంగ్'లో ప్రభాస్ భామ ఆడిపాడనుందా..??

By:  Tupaki Desk   |   18 Aug 2020 4:34 PM GMT
పుష్ప ఐటమ్ సాంగ్లో ప్రభాస్ భామ ఆడిపాడనుందా..??
X
ఈ ఏడాదిని 'అల వైకుంఠ‌పురంలో' అనే సూప‌ర్ హిట్ సినిమాతో ప్రారంభించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ సుకుమార్ రూపొందించనున్న పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న కన్నడ భామ ర‌ష్మ‌క మంద‌న హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇక ఇటీవ‌ల బ‌న్నీ బర్త్‌డే సంద‌ర్భంగా విడుదల చేసిన పుష్ప టైటిల్‌ పోస్టర్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఊరమాస్‌ రగ్డ్ లుక్కులో బ‌న్నీ క‌నిపించి ఫ్యాన్స్ అందరికి ట్రీట్ ఇచ్చాడు. అంతేకాదు ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందిస్తున్నారు సుకుమార్ టీమ్.

అందుకు తగ్గట్టుగానే ఐదు భాషల్లో ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుద‌ల చేయ‌గా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో బ‌న్నీ లారీడ్రైవరుగా కనిపించనున్నారు. అయితే క‌థ‌, క‌థనం గురించి ప‌క్క‌న పెడితే డైరెక్టర్ సుకుమార్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. అందులో భాగంగా ఈ సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ విషయం పై సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. నేను నా శాయశక్తులా ఈ సినిమాకు ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మా కాంబినేషన్లో ప్రతిసారిలాగే ఈ సినిమాలో కూడా ఓ మాంచి ఐటమ్ సాంగ్ ఉంటుందని చెప్పాడు. అంతేగాక మాస్ మ్యూజిక్ తో పాటు మంచి లిరిక్స్ కూడా డిఎస్పీ అందించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా.. అల్లు అర్జున్ అంటే డాన్స్ మాత్రం పక్కా ఓ రేంజిలో ఉంటుందని ఎక్సపెక్ట్ చేస్తారు. షూటింగ్ ముందే అన్నీ ప్రణాళిక బద్దంగా సిద్ధం చేస్తున్నారట. అయితే బన్నీ సరసన ఐటమ్ సాంగ్ లో ఆడిపాడటానికి ఓ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ని సంప్రదించినట్లు సమాచారం. ఆమె ఎవరో కాదు. సాహో బ్యూటీ శ్రద్ధాకపూర్ ని పుష్పలో ఐటమ్ సాంగ్ కోసం కలిసారట. ఏబీసీడీ-2 లో ఆమె డాన్స్ ఇరగదీసిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ కాబట్టి పాన్ ఇండియాకి పరిచయం ఉన్న స్టార్ అయితే బాగుంటుందని ఆమెతో చర్చలు జరిపినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. రంగస్థలంలో జిగేల్ రాణిగా పూజాహెగ్డే చిందేసింది. మరి ఈసారి ఎవరు చిందేస్తారో చూడాలి. లిస్టులో అయితే చాలామంది ఉన్నారట. అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.