Begin typing your search above and press return to search.

మ‌హేష్ బాబు సో క్యూట్ అంటూ బిస్కెట్ వేసింది!

By:  Tupaki Desk   |   29 May 2022 12:38 PM GMT
మ‌హేష్ బాబు సో క్యూట్ అంటూ బిస్కెట్ వేసింది!
X
శ్ర‌ద్ధా దాస్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. టాలీవుడ్ లో ద‌శాబ్ధం పైగా కెరీర్ ని ర‌న్ చేసిన యువ‌నాయిక‌. వ‌రుణ్ సందేశ్ స‌హా ప‌లువురు యువ‌హీరోల స‌ర‌స‌న న‌టించిన ఈ బ్యూటీ మొగుడు చిత్రంలో గోపిచంద్ స‌ర‌స‌న న‌టించింది. ఇంత‌కుముందు ప్ర‌వీణ్ స‌త్తారు గుంటూరోడు చిత్రంలో వేడిగా అందాలు ఆర‌బోసింది. రాజ‌శేఖ‌ర్ గ‌రుడ‌వేగ లోనూ శ్ర‌ద్దా క‌నిపించింది.

ప్ర‌స్తుతం జ‌బ‌ర్ధ‌స్త్ 2 సీజ‌న్ లో శ్ర‌ద్ధా దాస్ హొయ‌లు హాట్ టాపిక్ గా మారాయి. ఇంత‌కుముందు ఈ భామ ఎక్స్ ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ రెండో ఎపిసోడ్ ట్రైల‌ర్ లో న‌వ్వులు విర‌జిమ్ముతూ ఎంతో యాక్టివ్ గా క‌నిపించింది.

ఈ శుక్ర‌వారం స్పెష‌ల్ అంటూ మొన్న‌నే ఈటీవీలో స్ట్రీమింగ్ చేసారు. ఎక్స్ ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ 2 లో రాజ‌శేఖర్ తో క‌లిసి అత‌డి తాజా మూవీ శేఖ‌ర్ ప్ర‌మోష‌న్ ని చేసింది. సీనియ‌ర్ హీరోతో వేదిక‌పై స్టెప్పులు క‌లిపింది.

అదంతా అటుంచితే శ్ర‌ద్ధా ఇటీవ‌ల నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో ర‌క‌ర‌కాల గ్లామ‌ర‌స్ ఫోటోలు వీడియోల‌ను షేర్ చేస్తోంది. తాజాగా బ్లాక్ శారీలో శ్ర‌ద్ధా త‌న హొయ‌ల్ని ప్ర‌ద‌ర్శించిన ఓ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

స‌ర్కార్ వారి పాట నుంచి క‌ళావ‌తి సాంగ్ కి అభిన‌యిస్తూ మ‌హేష్ సో క్యూట్ అంటూ త‌న కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది. అయితే అలా బ్యాక్ చూపించి అర‌న‌వ్వు న‌వ్వేస్తూ శ్ర‌ద్ధా చాలా నే హొయ‌లు పోయినా అంత‌గా క్లిక్ కాలేదు.

ఆ పాట‌కు త‌న ఎక్స్ ప్రెష‌న్స్ కి అస్స‌లు సింక్ కాలేదు. క‌ళావ‌తి త‌న‌కు ఎంత ఫేవ‌రెట్ సాంగ్ అయినా కానీ జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సింది అంటూ ఆడియెన్ అడ్వ‌యిజ్ లు ఇస్తున్నారు. అయినా మ‌హేష్ బాబు సో క్యూట్ అని శ్ర‌ద్ధానే చెప్పాలా? ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌హేష్ కి ఉన్న ఫాలోవ‌ర్స్ లో గాళ్స్ గ్యాంగ్స్ ఎప్పుడో డిక్లేర్ చేసాయన్న‌ది శ్ర‌ద్ధాకు తెలిసిందే క‌దా!