Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : సాహో బ్యూటీ మరో సూపర్‌ షో

By:  Tupaki Desk   |   20 Jan 2023 2:44 PM GMT
ఫొటోటాక్‌ : సాహో బ్యూటీ మరో సూపర్‌ షో
X
బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ శ్రద్దా కపూర్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు సాహో సినిమా తో వచ్చిన విషయం తెల్సిందే. ఆ తర్వాత మళ్లీ తెలుగు లో ఈమె నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు. బాలీవుడ్‌ కే పూర్తిగా పరిమితం అయిన శ్రద్దా కపూర్‌ తాజాగా తూ జూతీ మైన్ మక్కార్ అనే సినిమాలో నటించింది.

రణబీర్ కపూర్‌ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా యొక్క ట్రైలర్‌ ను ఈనెల 23వ తారీకున విడుదల చేయబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు తెలియజేశారు. అందుకోసం ఈ పోస్టర్‌ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో శ్రద్దా కపూర్‌ అందాల ఆరబోతకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఈ మధ్య కాలంలో శ్రద్దా కపూర్‌ యొక్క పూర్తి అందాల ఆరబోత చూడలేదని.. ఈ సినిమాలో శ్రద్దా యొక్క సూపర్‌ హాట్ షో చూడబోతున్నట్లుగా అనిపిస్తుంది అంటూ ఈ పోస్టర్‌ చూస్తే అనిపిస్తుంది. తప్పకుండా అందరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

శ్రద్దా కపూర్‌ మరియు రణబీర్ కపూర్‌ ల జోడీకి ఉత్తరాదిన మంచి రెస్పాన్స్‌ దక్కింది. మార్చి నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా తో మరో విజయాన్ని రణబీర్ కపూర్‌ తన ఖాతాలో వేసుకుంటాడేమో చూడాలి. బ్రహ్మాస్త్ర సినిమా తో భారీ వసూళ్లు దక్కించుకున్న రణబీర్ కపూర్‌ కు ఈ సినిమా ఏ స్థాయి వసూళ్లను తెచ్చి పెడుతుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.