Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: పిల్లితోనే ప‌రాచిక‌మా శ్ర‌ద్ధా?

By:  Tupaki Desk   |   16 March 2021 9:00 AM IST
ఫోటో స్టోరి: పిల్లితోనే ప‌రాచిక‌మా శ్ర‌ద్ధా?
X
అందంగా లేనా అస‌లేం కానా..! అంటూ ఆ మార్జాలం ఆ క్యూటీ‌నే ఎందుకలా చూస్తోంది? అంతందంగా ఇల‌లో వేరొక భామ లేనేలేద‌నేది ఉద్ధేశ‌మా? ఏమో కానీ ఆ మార్జాలం సాహో శ్ర‌ద్ధ‌తో స్నేహం చేయాల‌ని ఎంత‌గా త‌పిస్తోందో చూశారు క‌దా!
శ్ర‌ద్ధా కూడా అంతే చిలిపిగా ఆ పిల్లితో స్నేహం చేసేసింది. త‌న‌నే చూస్తూ.. ఎంతో ప్రేమ‌గా ఒద్దికగా ప‌ల‌క‌రిస్తోంది.

ఈ మొత్తం ఎపిసోడ్ కాన్సెప్ట్ ని డిజైన్ చేశారా...? లేక ఫోటోషూట్ వేళ గోడ దూకిన పిల్లితో అలా క్లిక్ మ‌నిపించారా.. ? ఏదైతేనేం.. చూప‌రుల దృష్టిని ఆక‌ర్షించింది ఈ ఫోటో. అంకితా స్టూడియోస్ లో దీప‌క్ ఫోటోగ్ర‌ఫీలో ఇంత ల‌వ్ లీ ఫోటో పాజిబుల్ అయ్యింది. శ్ర‌ద్ధా అంద‌మైన న‌వ్వు పొట్టి ఫ్రాకు యువ‌త‌రాన్ని ఎంత‌గానో మురిపించేస్తున్నాయ్. ఇలాంటి స్మైల్ శ్ర‌ద్ధాకి మాత్ర‌మే సాధ్యం అంటూ కితాబిచ్చేస్తున్నారంతా.

ఇటీవ‌ల బోయ్ ఫ్రెండ్ రోహ‌న్ శ్రేష్ఠ‌తో క‌లిసి శ్ర‌ద్దా క‌పూర్ షికార్లు బాలీవుడ్ స‌ర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ జంట తొంద‌ర్లోనే పెళ్లికి రెడీ అవుతున్నార‌న్న పుకార్లు జోరుగా షికార్ చేస్తున్నాయి. శ్ర‌ద్ధా ప్ర‌స్తుతం సినిమాలు త‌గ్గించి కెరీర్ ప‌రంగా స్లోగా ఉండ‌డంతో పెళ్లి కోసం రెడీ అవుతోంద‌ని అంతా భావిస్తున్నారు.