Begin typing your search above and press return to search.

డిఫరెంట్ హోటల్ స్టార్ట్ చేసిన నాని ముద్దుగుమ్మ

By:  Tupaki Desk   |   15 March 2020 1:30 PM GMT
డిఫరెంట్ హోటల్ స్టార్ట్ చేసిన నాని ముద్దుగుమ్మ
X
కాలం మారింది. అందుకు తగ్గట్లే హీరోయిన్ల తీరు మారింది. గతంతో పోలిస్తే.. ఇప్పుడు హీరోయిన్లుగా ఇండస్ట్రీలో ఉన్న బ్యూటీల తీరు చూస్తే.. వారి ముందుచూపుకు మురిసిపోవాల్సిందే. తెలివితేటలకు వావ్ అనాల్సిందే. అందానికి అందం.. దానికి మించిన తీరులో ఉండే వారి ప్రాక్టికాలిటీకి ఫిదా అయ్యేలా వారు వ్యవహరిస్తున్నారు. గతంలో హీరోయిన్లు అంటే.. నాలుగు సినిమాలు చేశామా? ఆ ఇమేజ్ మత్తులో మునిగిపోవటమే తప్పించి.. మరో కెరీర్ మీద ఫోకస్ చేసే వారు కాదు.

ఇటీవల కాలంలో ట్రెండ్ మార్చేశారు. చేతిలో నాలుగు సినిమాలు ఉండి.. అవకాశాలకు కొదవలేనప్పుడే తమకున్న ఇమేజ్ ను మరింత సొమ్ము చేసుకునే దిశగా.. తమ అభిరుచికి తగ్గట్లు కొత్త కొత్త బిజినెస్ లు చేయటం ఇప్పుడో అలవాటుగా మారింది. ఆ బాటనే పట్టారు నేచురల్ స్టార్ నాని హీరోయిన్ శ్రద్ధా శ్రీనాద్. జెర్సీ చిత్రంలో ఆమె నటన తెలుగు ప్రేక్షకుల్ని ఆమెను గుర్తుంచుకునేలా చేసింది.నటనకు నటన.. అందానికి అందంతో వెండితెర మీద మెరిసిన ఈ బక్కపల్చటి భామ తాజాగా చెన్నైలో డిఫరెంట్ హోటల్ బిజినెస్ ను స్టార్ట్ చేసింది.

పర్ సే పేరుతో ప్రారంభించిన ఈ హోటల్లో ఫుడ్ కంటే కూడా సలాడ్స్ ఎక్కువగా దొరుకుతాయని చెబుతున్నారు. సమ్మర్ సీజన్ కు పర్ ఫెక్ట్ గా సూట్ అయ్యే కాన్సెప్టుతో ఆమె ఈ వెంచర్ ను షురూ చేశారని చెప్పాలి.నిజానికి దీన్ని హోటల్ అనే కంటే సలాడ్ బార్ లేదంటే.. సలాడ్ కేఫ్ అంటూ సరిగ్గా సూట్ అవుతుంది.

రెగ్యులర్ బర్గర్స్.. శాండ్ విచ్ లాంటి ఫుడ్స్ తో పాటు.. ఆరోగ్యానికి ఏ మాత్రం డ్యామేజ్ చేయని ఆహారాన్ని తమ వద్ద సర్వ్ చేస్తామని చెబుతుంది. ఇవాల్టి రోజున ఒక సినీ నటి స్టార్ట్ చేసిన హోటల్ అంటే.. దానికుండే క్రేజ్.. ఒకసారి ట్రై చేద్దామనుకునే వేళ.. ఎవరికి ఎలాంటి డిస్పాయింట్ మెంట్ లేకుండా చేసేలా కాన్సెప్ట్ ను సిద్ధం చేయటం ఈ మధ్యన ఎక్కువైంది.అందుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో శ్రద్ధా శ్రీనాద్ సలాడ్ బార్ ఉంటుందంటున్నారు. చెన్నైకి వెళ్లినప్పుడు ఒక లుక్ వేస్తే పోలా?