Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: శ్రద్దయిన అందం

By:  Tupaki Desk   |   28 Feb 2018 3:30 AM GMT
ఫోటో స్టోరి: శ్రద్దయిన అందం
X
సోషల్ మీడియా ఎకౌంట్స్ కి బ్లూ టిక్ వచ్చిందంటే చాలు తారలా రేంజ్ ఏంటో ఈజీగా అర్ధమవుతుంది. గత కొంత కాలంగా చాలా మంది సినిమా హీరోయిన్స్ ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే క్రేజ్ అందుకుంటున్నారు. హాట్ ఫొటోస్ తో క్రేజ్ అందుకోవడం ఈ రోజుల్లో కామన్ అయిపొయింది. ఇక అసలు విషయంలోకి వస్తే ఒక కన్నడ బ్యూటీ ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

యూ టర్న్ అనే కన్నడ సినిమాతో శ్రద్దా శ్రీనాథ్ అనే యువ హీరోయిన్ కు గతంలోనే చాలా క్రేజ్ ఏర్పడింది. కన్నడ తమిళ్ లో వరుస అవకాశాలు అందుతుండడంతో మ్యాగజైన్ వారు కూడా శ్రద్దా పై కాస్త ఇంట్రెస్ట్ పెట్టారు. ఈ బ్యూటీ అందాలను సరికొత్తగా ప్రజెంట్ చేసి ఈ మధ్య జే ఎఫ్ డబ్ల్యూ వారు కవర్ పేజ్ పై ప్రింట్ చేశారు. దీంతో అమ్మడి క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు.

శ్రద్దాకు సోషల్ మీడియాలో మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఈ మధ్య టాలీవుడ్ సైడ్ కూడా అమ్మడు ఆఫర్స్ అందుకుంటోంది. ప్రస్తుతం నాగార్జున - నాని మల్టి స్టారర్ సినిమాలో నటించడానికి ఒకే చెప్పేసింది. నాగార్జునకు ఆ కథలో జోడిగా కనిపించనుంది. అలాగే మరికొన్ని తెలుగు సినిమాల్లో కూడా ఆల్రెడీ నటిస్తోంది. అందులో హీరో ఆది సినిమా కూడా ఉందిలే. ఇక అమ్మడికి ఆఫర్స్ ఇప్పుడు దండిగా అందుతున్నాయట.