Begin typing your search above and press return to search.

ఏ టర్నూ కొట్టకుండానే మూడు సినిమాలు

By:  Tupaki Desk   |   30 Dec 2017 2:30 AM GMT
ఏ టర్నూ కొట్టకుండానే మూడు సినిమాలు
X
కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ కెరియర్ ప్లానింగ్ సూపర్బ్ గా ఉంది. 'యు టర్న్' వంటి సినిమాలతో ఇప్పటికే శాండల్ వుడ్ లో సత్తా చాటిన ఈ సుందరి.. తమిళ్ లోనూ ట్యాలెంట్ చూపించేసింది. త్వరలో తెలుగు ప్రేక్షకులకు కూడా తన తెగువ ఏంటో చూపించబోతున్న ఈ భామ.. ఇప్పుడు మరో ప్రాజెక్టుకు కూడా ఎంపిక అయిపోయింది.

రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఈమెకు టాలీవుడ్ అరంగేట్ర మూవీ కాగా.. ఇది కాకుండా అప్పుడే మరో రెండు తెలుగు సినిమాలకు కూడా సైన్ చేసేసింది శ్రద్ధా శ్రీనాథ్. ఒక్క రిలీజ్ లేకుండానే.. ఒకేసారి మూడు టాలీవుడ్ ప్రాజెక్టులను క్యాచ్ చేయడమంటే మామూలు విషయం కాదు. అయితే.. కెరీర్ స్టార్టింగ్ లోనే హోమ్ మేకర్ పాత్రలో నటించేందుకు యాక్సెప్ట్ చేసి మరోసారి షాక్ ఇచ్చింది ఈ కన్నడ కస్తూరి. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హవీష్ మూవీ.. నిన్ను వదిలి నేను పోలేనులే చిత్రానికి శ్రద్ధ సైన్ చేయగా.. ఈ చిత్రంలో ఈమెది గృహిణి పాత్ర కావడం విశేషం.

యూ-టర్న్.. విక్రమ్ వేద వంటి చిత్రాలలో శ్రద్ధా శ్రీనాథ్ నటనను చూసిన దర్శకుడు శ్రీరామ్.. ఈమెకు స్క్రిప్ట్ నేరేట్ చేయడం.. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో ఆమె కేరక్టర్ కు ఎంతటి ఇంపార్టెన్స్ ఉంటుందో తెలియచేయడం.. స్క్రిప్ట్ తో పాటు పాత్ర కూడా నచ్చడంతో శ్రద్ధా శ్రీనాథ్ అంగీకరించడం వరుసగా జరిగిపోయాయి. మొత్తానికి అసలు టాలీవుడ్లో ఏ టర్నింగ్ కొట్టకుండానే ఈమె మూడు సినిమాలు చేయడం విశేషం కదూ.