Begin typing your search above and press return to search.

మీటూ : సూపర్‌ స్టార్స్‌ ను కడిగేసిన బ్యూటీ

By:  Tupaki Desk   |   29 Oct 2018 1:30 AM GMT
మీటూ : సూపర్‌ స్టార్స్‌ ను కడిగేసిన బ్యూటీ
X
దేశ వ్యాప్తంగా మీటూ అంటూ పెద్ద ఎత్తు ఉద్యమం సాగుతున్న ఈ సమయంలో ఇప్పటి వరకు ఈ విషయమై స్టార్‌ హీరోలు సరిగా స్పందించలేదంటూ కన్నడ హీరోయిన్‌ శ్రద్దా శ్రీనాద్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కన్నడంలో యూటర్న్‌ చిత్రంతో ఒక్కసారిగా స్టార్‌ అయిన శ్రద్దా శ్రీనాథ్‌ గత కొన్ని రోజులుగా మీటూ ఉద్యమంపై మాట్లాడుతూ ఉన్నవిషయం తెల్సిందే. ఆమద్య స్టార్‌ హీరో అర్జున్‌ పై హీరోయిన్‌ శృతి హరిహరన్‌ లైంగిక ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆమెకు మద్దతుగా నిలిచి, వెంటనే అర్జున్‌ క్షమాపణలు చెప్పాలిందే అంటూ డిమాండ్‌ చేసింది.

కన్నడ సినీ రంగంలో కుదుపు కుదిపేస్తున్న అర్జున్‌ - శృతి హరిహరన్‌ విషయంలో చాలా స్ట్రాంగ్‌ వాయిస్‌ వినిపిస్తున్న శ్రద్ద శ్రీనాథ్‌ తాజాగా బాలీవుడ్‌ స్టార్స్‌ తో పాటు సౌత్‌ స్టార్స్‌ పై మండి పడినది. సినిమాల్లో ఒక్కో హీరో పది పదిహేను మంది రౌడీలను ఒకేసారి కొడతారు. తమ వారిని కాపాడుకునేందుకు సినిమాల్లో ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా విన్యాసాలు చేస్తారు. అమ్మాయి కష్టంలో ఉందంటే ఎంతటి రిస్క్‌ అయినా చేసే హీరోలు ఇప్పుడు ఆడవారు ఎదుర్కొంటున్న అతి పెద్ద కష్టం లైంగిక వేదింపుల గురించి ఎందుకు స్పందించరు అంటూ ప్రశ్నించింది.

స్టార్‌ హీరోలు ఈ విషయమై స్పందిస్తే చూడాలని ఉంది, వారు తమ స్టార్‌ డంను ఉపయోగించి ఆడవారి కష్టాలను ఉఫ్ఫ్‌ అంటూ ఊదేయాలని కోరుకుంటున్నాను అంటూ శ్రద్దా శ్రీనాథ్‌ వ్యాఖ్యనించింది. ప్రస్తుతం కన్నడంతో పాటు తమిళం మరియు తెలుగు సినిమాల్లో నటిస్తున్న ఈమె మంచి ప్రతిభ ఉన్న హీరోయిన్‌ గా పేరు తెచ్చుకుంది. తెలుగులో నాని జెర్సీ చిత్రంతో ఈమె పరిచయం కాబోతుంది.