Begin typing your search above and press return to search.

సాహో హీరోయిన్ చెడుగుడు

By:  Tupaki Desk   |   20 Dec 2018 2:13 PM GMT
సాహో హీరోయిన్ చెడుగుడు
X
డార్లింగ్ ప్రభాస్ తో సాహోలో జత కడుతూ టాలీవుడ్ డెబ్యూ చేస్తున్న హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఇప్పుడు బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంది. గ్లామర్ ఒలకబోసే రెగ్యులర్ పాత్రలు కాకుండా పెర్ఫార్మన్స్ కు ప్రాధాన్యత ఇచ్చే శ్రద్దాకు సాహోలో కూడా అలాంటి పాత్రే దక్కిందని ప్రభాస్ స్వయంగా ఓసారి చెప్పాడు కూడా. అయితే ఈ ముంబై బ్యూటీకి సాహో మాత్రమే చేతిలో లేదు. ఒకపక్కా సైనా నెహ్వాల్ బయోపిక్ లో టైటిల్ రోల్ పోషిస్తూ మరోపక్క చిచోరే అనే మరో మూవీలో రెండు విభిన్నమైన పాత్రలు చేస్తున్న శ్రద్ధా ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంది.

సాహో కోసం రామోజీ ఫిలిం సిటీతో యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొంటూ మధ్య మధ్యలో తన హిందీ సినిమాల పనులు కూడా చక్కబెట్టుకుంటోంది. ఒకరకంగా చెప్పాలంటే మూడు సినిమాల మధ్య తన పరిస్థితి చెడుగుడు ఆడుతున్నట్టు ఉంది. న్యూ ఇయర్ కు సాహోకు బ్రేక్ తీసుకుని ముంబై వెళ్లే ప్లాన్ లో శ్రద్ధా ఉన్నట్టు టాక్. అయితే వెంటనే వస్తుందా లేక కొంత గ్యాప్ తర్వాత జాయిన్ అవుతుందా అనే క్లారిటీ లేదు. శ్రద్ధా వచ్చే సంవత్సరం చాలా స్పెషల్. ఈ సినిమాలన్నీ విడుదలైపోతాయి. ఫస్ట్ లుక్స్ కూడా మహా అయితే మొదటి మూడు నెలల్లో వచ్చేస్తాయి.

దేనికవే చాలా ప్రత్యేకత ఉన్న ప్రాజెక్ట్స్ కావడంతో ఎవరికి దక్కని అరుదైన అవకాశం తనకు దక్కిందని ఖుషీలో ఉందీ భామ. సాహో కనక క్లిక్ అయితే అసలే హీరోయిన్ల కొరతతో అల్లాడుతున్న తెలుగు సినిమాకు మరో మంచి ఆప్షన్ దొరికినట్టు అవుతుంది. శ్రద్ధా ఈ ఏడాది నటించిన వాటిలో స్త్రీ బంపర్ హిట్ కాగా బత్తి గుల్ మీటర్ చాలు నిరాశ పరిచింది. ఇప్పుడీ మూడే తన టార్గెట్.