Begin typing your search above and press return to search.

ఇకపై కోర్టులోనే శ్రద్ధ

By:  Tupaki Desk   |   7 Jun 2017 5:52 AM GMT
ఇకపై కోర్టులోనే శ్రద్ధ
X
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ వరుసగా బయోపిక్స్ చేసేస్తోంది. ఇప్పటికే దావూద్ ఇబ్రహీం సోదరి హసీనాపై.. అపూర్వ లఖియా రూపొందిస్తున్న బయోపిక్ ను పూర్తి చేసిన ఈ భామ.. ఇప్పుడు తన కొత్త సినిమాను స్టార్ట్ చేయనుంది. ఇది సైనా నెహ్వాల్ బయోపిక్ కావడం విశేషం.

చిన్నతనం నుంచి శ్రద్ధాకపూర్ కు ఫుట్ బాల్.. బాస్కెట్ బాల్.. హ్యాండ్ బాల్ ఆటల్లో మంచి ప్రావీణ్యం ఉండగా.. ఇప్పుడు బ్యాట్మింటన్ నేర్చుకునేందుకు కోర్టుకు చేరుకుంది. తాజాగా ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేసింది ఈ బ్యూటీ. సీనియర్ కోచ్.. దీపికా పదుకొనే తండ్రి అయిన ప్రకాష్ పదుకొనే ట్రైనింగ్ లో శ్రద్ధా కపూర్ శిక్షణ పొందుతుండడం విశేషంగా చెప్పుకోవాలి. ముంబై సబర్బన్ లో ఉన్న వరల్డ్ క్లాస్ బ్యాడ్మింటన్ ట్రైనింగ్ సెంటర్ లో కొన్ని నెలల పాటు శ్రద్ధ ప్రాక్టీస్ చేయనుంది. ఇప్పటి నుంచి సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే వరకూ తాను గేమ్ పై తప్ప మరే అంశంపైనా దృష్టి పెట్టనని తేల్చిచెప్పేసింది శ్రద్ధ.

అంతేకాదు.. ఇకపై కొంతకాలంపాటు సైనా నెహ్వాల్ తో క్లోజ్ గా మూవీ అవ్వాలని డిసైడ్ అయినట్లు చెప్పింది బాలీవుడ్ బ్యూటీ. ఇక సైనా నెహ్వాల్ గురించి ఏడాదికిపైగా హైద్రాబాద్- ముంబై మధ్య చక్కర్లు కొట్టిన దర్శకుడు అమోల్ గుప్తే.. సైనా స్నేహితుల నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించినట్లు చెబుతున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/