Begin typing your search above and press return to search.

సాహో గాళ్ చిక్కిపోయిందేంటిలా?

By:  Tupaki Desk   |   9 May 2019 7:00 AM IST
సాహో గాళ్ చిక్కిపోయిందేంటిలా?
X
సాహో` చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది బాలీవుడ్ హాట్ గాళ్ శ్ర‌ద్ధాక‌పూర్. ఆరంగేట్ర‌మే బాహుబ‌లి స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న ఈ బ్యూటీ అవ‌కాశం ద‌క్కించుకోవ‌డం ల‌క్కీ అనే చెప్పాలి. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్లు.. వీడియోల్లో శ్ర‌ద్ధా లుక్ ఫెంటాస్టిక్ అంటూ అభిమానులు ప్ర‌శంస‌లు కురిపించారు. `షేడ్స్ ఆఫ్ సాహో మేకింగ్ వీడియో2 లో శ్ర‌ద్ధా యాక్ష‌న్ మోడ్ ప్ర‌భాస్ అభిమానుల‌కు పిచ్చిగా న‌చ్చేసింది. శ్ర‌ద్ధాకి ది బెస్ట్ సౌత్ ఎంట్రీ ఛాన్స్ ద‌క్కింద‌నే బాలీవుడ్ లో టాక్ న‌డుస్తోంది.

`సాహో` చిత్రాన్ని ఆగ‌స్టు 15న ష్యూర్ షాట్ గా రిలీజ్ చేసేందుకు సుజీత్‌- యువి క్రియేష‌న్స్ బృందం డెడ్ లైన్ పెట్టుకుని మ‌రీ ప‌ని చేస్తున్నారు. ఈ సినిమా షెడ్యూల్స్ కి స‌హ‌క‌రిస్తూనే శ్ర‌ద్ధా వ‌రుస‌గా ప‌లు భారీ బాలీవుడ్ చిత్రాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు సాహో షెడ్యూల్స్ ని పూర్తి చేస్తూనే.. అక్క‌డ‌ సినిమాల లొకేష‌న్ల‌కు ఎటెండ్ అవుతోంది. సాహో ఆన్ సెట్స్ ఉండ‌గానే శ్ర‌ద్ధా న‌టించిన ఓ రెండు చిత్రాలు రిలీజైన సంగ‌తి తెలిసిందే.

సాహో తో పాటు సైమ‌ల్టేనియ‌స్ గా `స్ట్రీట్ డ్యాన్స‌ర్స్ 3డి` అనే డ్యాన్స్ బేస్డ్ చిత్రంలో శ్ర‌ద్ధా న‌టిస్తోంది. ఈ చిత్రంలో వ‌రుణ్‌ ధావ‌న్ క‌థానాయ‌కుడు. ఏబీసీడీ ఫేం రెమో డి.సౌజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో మొత్తం 12 పాట‌లు ఉన్నాయ‌ని .. ఈ పాట‌ల్లో శ్ర‌ద్ధ మెరుపు డ్యాన్సులు మైమ‌రిపిస్తాయ‌ని చెబుతున్నారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 8న రిలీజ‌వుతోంది. ఇక‌పోతే.. సైనా నెహ్వాల్ బ‌యోపిక్ లో న‌టించే అరుదైన ఛాన్స్ ని శ్ర‌ద్ధా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల‌ మిస్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా శ్ర‌ద్ధా క‌పూర్ డ్యాన్స్ ప్రాక్టీస్ పూర్తి చేసి స్టూడియో నుంచి బ‌య‌టికి వ‌చ్చిన‌ప్ప‌టి ఫోటోలు.. వీడియోల్ని వైర‌ల్ భ‌యానీ సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేశారు. ఆ టైట్ ఫిట్ స్పోర్ట్స్ వేర్ లో శ్ర‌ద్ధా 6 ప్యాక్ బ‌య‌ట‌పడింది. అస‌లే స‌న్న‌జాజి తీగ‌లా ఉన్న శ్ర‌ద్ధా నిరంత‌రం జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేస్తూ యాబ్స్ ని తీరుగ్గా త‌యారు చేసింద‌న్న‌మాట‌. ఇక ఈ ఫోటోలు.. వీడియోలు యువ‌త‌రం వాట్సాప్ ల‌లో జోరుగా వైర‌ల్ అయిపోతున్నాయి.